భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో అనుమతుల్లేకుండా వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. పాల్వంచ పట్టణంలోని గట్టాయిగూడెం, బొల్లోరిగూడెం, నట్రాజ్ సెటర్లలోని పలువురు వ్యాపారుల నివాసాలపై సీసీఎస్ టాస్క్ఫోర్స్ ఎస్సై పుల్లయ్య సిబ్బందితో కలిసి ఏకకాలంలో దాడులు చేశారు.
అనంతరం సీసీఎస్ టాస్క్ఫోర్స్ ఎస్సై పుల్లయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. గుడివాడ చంద్రశేఖర్ వద్ద లెక్కించే యంత్రం, రూ.1,26,560, మంచికంటి సత్యనారాయణ వద్ద నూ.4 లక్షలు, ప్రామిసరీ నోట్లను , పాల్వంచ పట్టణ కల్లూరి రామకృష్ణార్జునరావు నుంచి రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకుని ఠాణాకు తరలించారు. మొత్తం రూ.7,26,560 నగదును సీజ్ చేశారు. పాల్వంచ పట్టణ ఎస్సై నరేశ్ కు అప్పగించినట్లు తెలిపారు. ఎస్సై నరేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో మంగళవారం (10.05.22)న సిసిఎస్, టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు చేపట్టారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు సీఐ పుల్లయ్య ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం అక్రమ చిట్ ఫండ్, ఫైనాన్స్ లను నిర్వహిస్తున్న విశ్వసనీయ సమాచారంతో పలువురు వడ్డీ, చిట్టి వ్యాపారస్తుల దుకాణాలు ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పలు రికార్డులు డాక్యుమెంట్లను పరిశీలించారు.
భద్రాచలం రోడ్డు లో ఫైనాన్స్ షాప్ నిర్వహించే సదా మోహన్ బాబు వద్ద నుంచి తాకట్టు పెట్టుకున్న 105 బంగారు ఆభరణాలు ప్యాకెట్, 14 వెండి ఆభరణాల ప్యాకెట్.. మరియు రూ.3,49,970 నగదు అక్రమ బాండు పేపర్లు, సంతకాలు చేయని చెక్కులు ప్రామిసరీ నోట్లను |స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బస్తాండ్ సెంటర్లో బుక్ స్టాల్ నిర్వహించే కంచర్ల రమేష్ గుప్తా వద్ద నుంచి రూ.1,66,750 నగదు, అక్రమ ప్రాంసరీ నోట్లు, సంతకాలు లేని చెక్కులు.. లైసెన్స్ లేకుండా అధిక వడ్డీతో నిర్వహిస్తున్న చిట్టీలు, ఫైనాన్స్ కు సంబంధించి మొత్తం రూ. 5,16,720 నగదు మరియు సుమారుగా రూ.25,00,000 విలువచేసే బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
USA: అమెరికాలో దారుణం… కాల్పుల్లో 10 మంది మృతి