తొక్కిసలాట ఘటనపై బెంగుళూరు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తొక్కిసలాట గాయపడిన బాధితుడు ఫిర్యాదు మేరకు నమోదు చేశారు. ఆర్సీబీ ఎక్స్ చేసిన పోస్టు చూసి తాను ర్యాలీ కి వచ్చి గాయపడ్డానని ఆర్సీబీ ఫ్యాన్ అయిన బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి తప్పులకు తాను ఇబ్బందులు పడాల్సి వచ్చిందని.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు…
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం (జూన్ 4) నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవాల సందర్భంగా మైదానం వెలుపల తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. పెద్దఎత్తున అభిమానులు స్టేడియం వద్దకు చేరుకోవడం, అదే సమయంలో వర్షం పడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన యావత్ దేశంను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనపై ప్రతి ఒక్కరు సంతాపం వ్యక్తం చేశారు. బెంగళూరు…
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన టైటిల్ పోరులో ఆర్సీబీ సంచలన విజయం సాధించి మొదటిసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ సాధించిన విజయాన్ని తమ విజయంగా భావించారు. బాణాసంచా కాలుస్తూ సంబరాల్లో మునిగితేలారు. మెట్రో సిటీలలో అభిమానం శృతి మించింది. రోడ్లపైకి వచ్చి క్రాకర్స్ కలుస్తూ…
చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ DNA ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, ఇతరులపై FIR నమోదు చేశారు పోలీసులు. FIRలో నేరపూరిత హత్య వంటి తీవ్రమైన అభియోగాలు నమోదు చేశారు. అదే సమయంలో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అరెస్టు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మొదటి అరెస్టు జరిగింది. బెంగళూరు విమానాశ్రయంలో ఆర్‌సిబి మార్కెటింగ్ హెడ్…
ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు సంబరాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. ఈ విషాద ఘటనపై ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంబరాల కంటే జనం ప్రాణాలు ముఖ్యమని పేర్కొన్నారు. క్రీడా విజయాలను ఉత్సవంగా జరపడానికి రోడ్ షోలు అవసరం లేదన్నారు. ఇంగ్లండ్‌తో భారత్ టెస్టు సిరీస్ నేపథ్యంలో ముంబైలో కెప్టెన్ శుభ్‌మన్…
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం వండాడి గ్రామం యర్రగట్టవాండ్లపల్లెకు చెందిన బి.దివ్యాంశి (14) అనే బాలిక మృత్యువాత పడ్డారు. యర్రగట్టవాండ్లపల్లె చెందిన శివకుమార్ బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. భార్య అశ్విని, ఇద్దరు పిల్లలతో కొన్నేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు.
Gautam Gambhir: బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాటపై భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, విజయోత్సవాల కోసం రోడ్లపై జరిపే ర్యాలీల అవసరం లేదని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. నాకు ఎప్పుడూ వీధి ర్యాలీలపై నమ్మకం లేదని.. ఇలా జరగడం దురదృష్టకరం అని అన్నారు. 11 ప్రాణాలు పోవడం అంటే ఊహించలేనిది. విజయం ఎంత…
ఆర్సీబీ విజయోత్సవాల వేళ బెంగళూరులో సంభవించిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. ఈ ఘటనపై సుమోటో కేసు నమోదు చేయాలని బెంగళూరు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తొక్కిసలాట ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిందితులుగా చేర్చారు. మరోవైపు మెజిస్టేరియల్ విచారణలో భాగంగా ఇప్పటికే వారికి అధికారులు నోటీసులను జారీ చేశారు.
Bengaluru Stampede: పీఎల్ విజేత ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడినవారిలో చాలామంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని ఆసుపత్రుల వర్గాలు గురువారం తెలిపాయి. చికిత్స పొందుతున్న వారికి ప్రస్తుతం ప్రాణాపాయం లేదని సమాచారం. బౌరింగ్ మరియు లేడీ కర్జన్ ఆసుపత్రిలో మొత్తం 18 మంది చికిత్స పొందగా, ప్రస్తుతం కేవలం ఇద్దరు మాత్రమే ఆసుపత్రిలో ఉన్నారు. ఇందులో ఒకరు కాలికి ఫ్రాక్చర్ కాగా.. మరో 14 ఏళ్ల బాలుడు కంటికి…
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పు నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల వేళ పెనువిషాదం చోటుచేసుకుంది. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో సహా పలువురు ఇప్పటికే ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్సీబీ యాజమాన్యం సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అంతే కాకుండా.. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం…