తొక్కిసలాట ఘటనపై సుమోటో కేసు నమోదు చేయాలని బెంగళూరు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. మంగళవారం స్టేటస్ రిపోర్టును పరిశీలన చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తొక్కిస్లాట ఘటనపై బెంగళూరు హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఘటనపై ప్రభుత్వానికి సంబంధించి వివరాలను అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. రెండున్నర లక్షల మంది స్టేడియం వద్ద చేరుకున్నారని.. తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందారని.. 56 మంది గాయాలు, 15…
మంగళవారం (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి బుధవారం మధ్యాహ్నం బెంగళూరుకు చేరుకుంది. విధానసౌధ ప్రాంగణంలో ఆర్సీబీ క్రికెటర్లను సన్మానించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడంతో.. టీమ్ బస్సు సాయంత్రం 4.30 గంటలకు అక్కడకు చేరుకుంది. అనంతరం చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు జట్టును సన్మానించడానికి కర్ణాటక క్రికెట్ సమాఖ్య…
బుధవారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వద్ద పెను పెద్ద విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పును ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవ సంబరాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. అభిమానుల మృతి, గాయాలతో చిన్నస్వామి స్టేడియం వద్ద శోకసంద్రంగా మారింది. అయితే కొందరు దుర్మార్గులు ఈ తొక్కిసలాట ఘటను అవకాశంగా తీసుకుని.. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.…
Bengaluru Stampede: ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలుచుకున్న సందర్భంగా బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు విషాదంగా ముగిసాయి. ఈ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మంది కి పైగా గాయపడ్డారు. స్టేడియం బయట సుమారు రెండు లక్షల మంది అభిమానులు భారీగా గుమికూడటంతో, పరిస్థితిని పోలీసులు నియంత్రించలేకపోయారు. Read Also: Chinnaswamy Stadium Stampede: బెంగళూరులో తొక్కిసలాట.. ఎగ్జాట్లీ ఏ సమయంలో జరిగిందంటే..? ఈ…
Chinnaswamy Stadium Stampede: బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఆటగాళ్ల సన్మాన కార్యక్రమం జరిగిన చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడగా.. ఇంకా పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
ఆర్సీబీ విజయోత్సవాల్లో విషాద ఘటనపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తొక్కిసలాటపై సీఎం విచారం వ్యక్తం చేశారు. 11 మంది చనిపోయినట్లు సీఎం స్పష్ట చేశారు. మరో 33 మందికి గాయాలైనట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. వైద్యులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని సీఎం చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో…
బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రమాదం పూర్తిగా హృదయ విదారకం అన్నారు.
RCB Stampede: ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. ఈ క్రమంలోనే బెంగళూరులో ఆర్సీబీకి ఘన స్వాగతం లభించింది. అయితే, ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో తీవ్ర చోటు చేసుకుంది.
ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం ఏమిటంటే.. ఆర్సీబీ జట్టు అభిమానులు ఒక్కసారిగా చిన్నస్వామి స్టేడియంలోకి రావడానికి ప్రయత్నిస్తుండగా సరైన సమయంలో గేట్లు ఓపెన్ చేయకపోడం వల్లే ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవ ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. చిన స్వామి స్టేడియానికి ఆర్సీబీ అభిమానులు పోటెత్తడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అభిమానులు పరుగులు తీయడంతో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 15 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. అయితే.. ఈ నేపథ్యంలో భారీ జనసమూహం కారణంగా ఆర్‌సీబీ ఐపీఎల్ విజయోత్సవ వేడుకల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్-బస్ పరేడ్ రద్దు చేశారు.…