Bengaluru Stampede: పీఎల్ విజేత ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడినవారిలో చాలామంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని ఆసుపత్రుల వర్గాలు గురువారం తెలిపాయి. చికిత్స పొందుతున్న వారికి ప్రస్తుతం ప్రాణాపాయం లేదని సమాచారం. బౌరింగ్ మరియు లేడీ కర్జన్ ఆసుపత్రిలో మొత్తం 18 మంది చికిత్స పొందగా, ప్రస్తుతం కేవలం ఇద్దరు మాత్రమే ఆసుపత్రిలో ఉన్నారు. ఇందులో ఒకరు కాలికి ఫ్రాక్చర్ కాగా.. మరో 14 ఏళ్ల బాలుడు కంటికి దగ్గరలో గాయం కారణంగా ఆబ్జర్వేషన్‌లో ఉన్నారు.
Read Also: RCB Stampede: తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం.. ఎంతంటే?
ఇక వైదేహీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 16 మందిని తరలించగా వారిలో నాలుగురు అప్పటికే మృతి చెందిన స్థితిలో ఆసుపత్రికి చేరినట్టు అధికార ప్రతినిధి తెలిపారు. మిగతా బాధితుల్లో ఇద్దరు ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఆసుపత్రి వర్గాల ప్రకారం బాధితులకు ప్రధానంగా చిన్నపాటి గాయాలు, భయం, ఉద్వేగాలు ఉండగా, న్యూరాలజీ విభాగం వారి మానసిక పరిస్థితిని పరిశీలిస్తోంది. ఈ ఘటన తర్వాత భద్రతా చర్యలపై మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరం అంటూ సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.