CV Anand: బాధ్యత ఉండక్కర్లా.. ఏంటీ ఈ చిల్లర వేషాలు!
- మొదటిసారి ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ కైవసం
- అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది
- రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న వేలాది మంది
- హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన టైటిల్ పోరులో ఆర్సీబీ సంచలన విజయం సాధించి మొదటిసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో వేలాది మంది రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఆర్సీబీ సాధించిన విజయాన్ని తమ విజయంగా భావించారు. బాణాసంచా కాలుస్తూ సంబరాల్లో మునిగితేలారు.
మెట్రో సిటీలలో అభిమానం శృతి మించింది. రోడ్లపైకి వచ్చి క్రాకర్స్ కలుస్తూ అలజడి సృష్టించారు. వాహనదారుల్ని రోడ్డుపై నిలిపివేసి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కొందరు బట్టలిప్పి నానా హంగామా చేశారు. ఆర్టీసీ బస్సులపై ఎక్కి ఆర్సీబీ జెండాలతో నినాదాలు పలికారు. ఇంకొందరు కార్లపైకి ఎక్కి రచ్చ రచ్చ చేశారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి గూండాల్లా ప్రవర్తించారు. ఏకంగా తెలంగాణ సెక్రటేరియట్ ముందు బాణాసంచా కాలుస్తూ నానా హంగామా చేశారు. బట్టలిప్పి బస్సులపై, వచ్చిపోయే లారీలపైకి ఎక్కి పైశాచిక ఆనందం పొందారు. ఆర్సీబీ చాన్నాళ్ల తర్వాత కప్ గెలవడంతో సంతోషం ఉండొచ్చు.. బట్ ఇలా శృతిమించి ప్రవర్తిస్తే అది సొసైటీకి చెడ్డ పేరు తీసుకొస్తుంది.
Also Read
Also Read: Eatala Rajendar: అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం.. అన్నీ కేబినెట్ నిర్ణయం మేరకే!
హైదరాబాద్ లాంటి మహానగరంలో జూన్ 3 అర్ధరాత్రి జరిగిన సంఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బ తీసేలా అభిమానులు ప్రవర్తించారన్న పేరు వచ్చింది. దీనిపై హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందిస్తూ.. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘బెంగళూరు తొక్కిసలాట చూసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామని ఆశ్చర్యం కలిగింది. ఆర్సీబీ ప్రపంచకప్ గెలవలేదు. ఆర్సీబీ జాతీయ జట్టు కాదు. బిజినెస్ పరంగా నడిచే ఓ ఐపీఎల్ ఇది. అర్థరాత్రి 12 గంటలకు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్‌లపైకి భారీ సంఖ్యలో యువకులు రావడం ఆందోళన కలిగించింది. వాళ్ళని అదుపుచేసేందుకు ఉన్న పోలీసులు చాలక అదనపు బలగాలను దించాల్సి వచ్చింది. పౌరులు భయం, బాధ్యత కలిగి ఉండాలి’ అని సీవీ ఆనంద్ అన్నారు.
తాజావార్తలు
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!