చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ DNA ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, ఇతరులపై FIR నమోదు చేశారు పోలీసులు. FIRలో నేరపూరిత హత్య వంటి తీవ్రమైన అభియోగాలు నమోదు చేశారు. అదే సమయంలో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అరెస్టు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం మొదటి అరెస్టు జరిగింది. బెంగళూరు విమానాశ్రయంలో ఆర్‌సిబి మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read:Elon Musk: సెక్స్ స్కామ్ నిందితుడితో ట్రంప్‌కు సంబంధాలు.. మస్క్ సంచలన ఆరోపణలు
మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విక్టరీ పరేడ్ కు సంబంధించి నిఖిల్ సొసలే అనధికారిక ప్రమోషన్స్ చేశారని, అనుమతి లేకుండా పరేడ్ నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి. డిఎన్‌ఎ ఈవెంట్ ఆర్గనైజర్ సునీల్ మాథ్యూ కిరణ్ సహా మరోకరిని అరెస్టు చేశారు. వారందరినీ కబ్బన్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఆర్‌సిబి తన తొలి ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకున్న వేడుకల్లో పాల్గొనడానికి లక్షలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం వెలుపల గుమిగూడారు. ఈ సమయంలో, తొక్కిసలాట చోటుచేసుకోగా 11 మంది మరణించారు. 56 మంది గాయపడ్డారు. ఈ కేసును దర్యాప్తు కోసం సిఐడికి అప్పగించారు.
Also Read:Delhi: ఢిల్లీలో ఎద్దు బీభత్సం.. నిలిచి ఉన్న వ్యక్తిపై దాడి.. వీడియో వైరల్
పోలీస్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆర్‌సిబిని మొదటి నిందితుడిగా, డిఎన్‌ఎ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ను రెండవ నిందితుడిగా, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీని మూడవ నిందితుడిగా చేర్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన అనుమతి తీసుకోలేదని FIR పేర్కొంది. RCB, DNA ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అవసరమైన అనుమతి లేకుండానే విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. FIR దాఖలు చేసిన తర్వాత చట్టపరమైన చర్యలకు సహకరిస్తామని RCB తెలిపింది.