చిత్ర పరిశ్రమలో నిర్మాత బెల్లంకొండ సురేష్ పై ఫైనాన్షియర్ శరణ్ చీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి తన వద్ద సినిమాకోసమని రూ. 85 లక్షలు అప్పుగా తీసుకొని.. తిరిగి ఇవ్వమంటే చంపేస్తామని బెదిరిస్తునట్లు అతడు ఫిర్యాదు లో తెలిపాడు. ఇక నేడు బెల్లంకొండ సురేష్ ఈ కేసుపై స్పందిస్తూ తనను బ్యాడ్ చేయడానికే ఇలాంటి ఆరోపణలు… నా పంచ ప్రాణాలైన పిల్లల జోలికి వచ్చారు… శరణ్ పై పరువు…
ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన కొడుకు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మీద చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ “85 లక్షల రూపాయలు తీసుకున్నాను అంటూ నాపై ఆరోపణ వచ్చింది. నన్ను బ్యాడ్ చేయడానికి శరణ్ ఈ ఆరోపణలు చేశారు. కోర్టులో ప్రైవేటు పిటీషన్ వేశాడు.. అతని దగ్గర ఆధారాలు తీసుకురావాలంటూ శరణ్ కు నోటీసులు ఇచ్చింది కోర్టు. నా పిల్లలు నా…
చిత్ర పరిశ్రమ అన్నాకా నిర్మాతలకు, ఫైనాన్షియర్లకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒకరి మీద ఒకరు పోలీస్ కేసులు పెట్టుకుంటూనే ఉంటారు. తాజాగా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ పై ఒక ఫైనాన్షియర్ పోలీస్ కేసు పెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది. కేవలం నిర్మాత బెల్లంకొండ సురేష్ పైనే కాకుండా ఆయన కొడుకు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పైన కూడా కేసు పెట్టడం గమనార్హం.. వివరాల్లోకి వెళితే.. బెల్లంకొండ సురేష్.. శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి…
సినిమా రంగాన్ని నమ్ముకుంటే తప్పకుండా ఆ తల్లి ఆదరిస్తుంది అంటూ ఉంటారు. చిత్రసీమలో విజయం సాధించిన వారందరి మాటా ఇదే! ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ సైతం అదే మాటను పలుకుతూ ఉంటారు. చిత్రసీమలో అడుగు పెట్టి, ఒక్కో మెట్టూ ఎక్కుతూ, చివరకు నిర్మాతల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు బెల్లంకొండ సురేశ్. ఆయన తనయుడు సాయి శ్రీనివాస్ నవతరం హీరోల్లో ఒకరిగా సాగుతున్నారు. బెల్లంకొండ సురేశ్ 1965 డిసెంబర్ 5న గుంటూరు జిల్లాలో జన్మించారు.…
టాలీవుడ్ లో స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథపై రెండు సినిమాలు రాబోతున్నాయి. ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా “స్టూవర్టుపురం దొంగ” అనే టైటిల్ తో సినిమాను ప్రకటించారు. దర్శకుడు కేఎస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బెల్లంకొండ సురేష్ ఈ ప్రాజెక్ట్ కు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇక రీసెంట్ గా రవితేజ హీరోగా “టైగర్ నాగేశ్వరరావు” అనే టైటిల్ తో సినిమాను ప్రకటించారు. దీనికి వంశీ దర్శకత్వం వహించారు. ఈ బయోపిక్‌కి అభిషేక్ అగర్వాల్…
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం “ఛత్రపతి” హిందీ రీమేక్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం జరిగింది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి మొదటి షాట్ క్లాప్ కొట్టారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఆయనే బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ ఎంట్రీ మూవీకి కూడా దర్శకుడిగా వ్యవహరించారు. ఈ రీమేక్‌ను పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడా నిర్మించనున్నారు. బాలీవుడ్ కు తగ్గట్లుగా స్క్రిప్ట్‌ను అప్‌డేట్ చేసినట్లు…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ “ఛత్రపతి” రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జయంతిలాల్ గడా ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా కోసం మేకర్స్ ఓ భారీ విలేజ్ సెట్ ను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలో ఈ సెట్ నిర్మాణం జరుగుతోందట. ఈ రీమేక్ మొదటి షెడ్యూల్ జూలై మొదటి వారం నుండి ఈ…