బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ “ఛత్రపతి” రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జయంతిలాల్ గడా ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా కోసం మేకర్స్ ఓ భారీ విలేజ్ సెట్ ను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలో ఈ సెట్ నిర్మాణం జరుగుతోందట. ఈ రీమేక్ మొదటి షెడ్యూల్ జూలై మొదటి వారం నుండి ఈ సెట్‌లో జరుగుతుంది. షూటింగ్‌లో ప్రధాన భాగం హైదరాబాద్, ముంబై, బంగ్లాదేశ్‌లో జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఖరారు చేయలేదు మేకర్స్. మరోవైపు బెల్లకొండ శ్రీనివాస్ “కర్ణన్” రీమేక్ లో నటించనున్నారు. తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన “కర్ణన్” బ్లాక్ బస్టర్ హిట్ నువు అందుకుంది. ఈ చిత్రం తెలుగు రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించనున్నారు. అయితే ఛత్రపతి రీమేక్ తరువాత కర్ణన్ పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. మరి బెల్లంకొండ హీరో “ఛత్రపతి” లాంటి భారీ రీమేక్ తో బాలీవుడ్ లో సత్తా చాటుతాడేమో చూడాలి.