“ఛత్రపతి” రీమేక్ లో హీరోయిన్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం “ఛత్రపతి” హిందీ రీమేక్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం జరిగింది. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి మొదటి షాట్ క్లాప్ కొట్టారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఆయనే బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ ఎంట్రీ మూవీకి కూడా దర్శకుడిగా వ్యవహరించారు. ఈ రీమేక్‌ను పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడా నిర్మించనున్నారు. బాలీవుడ్ కు తగ్గట్లుగా స్క్రిప్ట్‌ను అప్‌డేట్ చేసినట్లు నిర్మాత తెలిపారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గురించి ఇంతవరకూ మేకర్స్ ప్రకటించలేదు. దీంతో హీరోయిన్ విషయంలో సస్పెన్స్ నెలకొంది.
Read Also : సెన్సార్ పూర్తి చేసుకున్న “తిమ్మరుసు”
Also Read
తాజా సమాచారం ప్రకారం రెజీనా కాసాండ్రా ఇందులో కథానాయికగా కన్పించబోతోందని తెలుస్తోంది. ఇది రెజీనాకు హిందీలో రెండవ చిత్రం అవుతుంది, ఇది ఇప్పటికే “ఏక్ లడ్కి కో దేఖా తో ఐసా లగా”తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం 2018లో రిలీజ్ అయ్యింది. రెజీనా చేతిలో దాదాపు 7 తమిళ చిత్రాలు ఉన్నాయి. ఈ నటి మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య”లో కూడా అతిధి పాత్రలో నటిస్తుంది.
తాజావార్తలు
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!