టాలీవుడ్ లో స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథపై రెండు సినిమాలు రాబోతున్నాయి. ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా “స్టూవర్టుపురం దొంగ” అనే టైటిల్ తో సినిమాను ప్రకటించారు. దర్శకుడు కేఎస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బెల్లంకొండ సురేష్ ఈ ప్రాజెక్ట్ కు నిర్మాతగా వ్యవహరించనున్నారు.
ఇక రీసెంట్ గా రవితేజ హీరోగా “టైగర్ నాగేశ్వరరావు” అనే టైటిల్ తో సినిమాను ప్రకటించారు. దీనికి వంశీ దర్శకత్వం వహించారు. ఈ బయోపిక్‌కి అభిషేక్ అగర్వాల్ నిర్మాత. టైగర్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత నాలుగేళ్లపాటు స్క్రిప్ట్‌పై వర్క్ చేశానని చిత్ర దర్శకుడు వంశీ పేర్కొన్నారు. టైగర్ నాగేశ్వరరావు జీవితకథపై ఆయన కుటుంబ సభ్యుల నుంచి సినిమా తీయడానికి అన్ని అనుమతులు కూడా పొందామని చెప్పారు. బెల్లంకొండ సురేష్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరామని, అయితే ఆయన తమ మాట వినలేదని అభిషేక్ అగర్వాల్ అన్నారు.
Read also : “పుష్ప” : పొగరుబోతు దాక్షాయణిగా అనసూయ లుక్
మరోవైపు టైగర్ నాగేశ్వరరావుపై సినిమా తీసే హక్కు తనకు ఉందని బెల్లంకొండ సురేష్ అంటున్నారు. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న వ్యక్తిత్వంపై ఎవరైనా సినిమా తీయవచ్చు అని బెల్లంకొండ అన్నారు. టైగర్ నాగేశ్వరరావు జీవిత కథపై ప్రకటించిన బయోపిక్‌లు త్వరలో న్యాయ పోరాటానికి సిద్దమవ్వడం ఖాయం. ప్రస్తుతానికి రెండు టీమ్‌లు తమ తమ చిత్రాల చిత్రీకరణ కోసం సిద్ధమవుతున్నాయి.