అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా, ఎలాంటి గొడవలకి, కాంట్రవర్సీలకీ పోకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు మార్కెట్ ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హిందీలో మాత్రం స్టార్ హీరో రేంజ్ మార్కెట్ ఉంది. సాయి శ్రీనివాస్ డబ్బింగ్ సినిమాలకి మిలియన్ల వ్యూస్…
కరోనా ఫస్ట్ వేవ్ తో గత యేడాది, సెకండ్ వేవ్ తో ఈ సంవత్సరం సినిమా రంగానికి గట్టి పరీక్షనే పెట్టాయి. అయితే… యువ కథానాయకులు మాత్రం ఏదో ఒక స్థాయిలో బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతారని అంతా అనుకున్నారు. కానీ తెలుగు ప్రేక్షకుల అంచనాలను తల్లకిందులు చూస్తే, మన యంగ్ హీరోస్ ఈ యేడాది భారీ పరాజయాలను తమ ఖాతాలో జమ చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’…
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వి. వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీని తర్వాత సాయి శ్రీనివాస్ ‘స్టూవర్ట్ పురం దొంగ’ మూవీని పట్టాలెక్కించాల్సి ఉంది. ఇదిలా ఉంటే… తెలుగు మూలాలు కలిగిన ప్రముఖ హిందీ హాస్య నటుడు జానీ లివర్ ‘ఛత్రపతి’ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తన సోషల్ మీడియా…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. దానితో పాటే తమిళ సినిమా ‘కర్ణన్’ రీమేక్ లోనూ నటించబోతున్నట్టు ఆ మధ్య ప్రకటించాడు. ఇది కాకుండా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ‘స్టూవర్ట్ పురం దొంగ’ నూ చేయబోతున్నట్టు తెలిపాడు. దీనిని అతని తండ్రి బెల్లంకొండ సురేశ్ నిర్మించబోతున్నారు. రెండు రోజుల ముందు రవితేజ సైతం ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా తీయబోతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో తానూ తగ్గేది లే అంటున్నాడు సాయి శ్రీనివాస్. దీపావళి…
ఏ మనిషినైనా మంచివాడుగా, చెడ్డవాడుగా చిత్రీకరించేవి – అతని చుట్టూ ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు. ఓ మనిషి దొంగకావడానికి అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి అని చర్చించవలసి ఉంటుంది. ఈ కోణంలో ఆలోచించే కరడు కట్టిన నేరస్థులలో సైతం పరివర్తన కలిగించాలని సామాజిక ఉద్యమకారులు గోరా, ఆయన కోడలు హేమలతా లవణం నడుం బిగించారు. ఎందరో దొంగలలో సత్ర్పవర్తన కలిగేలా చేశారు. అలా ప్రకాశం జిల్లాలో స్టూవర్ట్ పురం అనే ఊరిలో దొంగలలో మార్పు తీసుకు…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మాస్ డైరెక్టర్ వివి వినాయక్ సహచరుడు కెఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్టూవర్ట్ పురం దొంగ’. బయోపిక్ అఫ్ టైగర్ అనేది ట్యాగ్ లైన్. 1970 లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన సాహసోపేతమైన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రం కరోనా కారణంగా కొద్దిగా వెనక్కి తగ్గింది. ఇకపోతే ఇటీవల ఈ బయోపిక్ లో రవితేజ నటిస్తున్నాడని, ‘టైగర్ నాగేశ్వరరావు’…
తమిళంలో విష్ణు విశాల్, అమలా పాల్ కీలక పాత్రలు పోషించిన ‘రాక్షసన్’ మూవీ ఘన విజయం సాధించింది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా తమిళ భాషలో 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. ఇదే సినిమాను తెలుగులో రమేశ్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా రీమేక్ చేశారు. ఇక్కడా ఈ సినిమా చక్కని విజయాన్ని సాధించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాల్లో మంచి…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా తన అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు. కర్నూలుకు చెందిన ఓ అభిమాని కొత్త ఇంటిని నిర్మించి, తన అభిమాన హీరోని గృహప్రవేశ వేడుకకు ఆహ్వానించాడు. సాధారణంగా తమ బిజీ షెడ్యూల్ కారణంగా హీరోలు ఇలాంటి ఆహ్వానాలను మన్నిస్తారని ఆశించరు. కానీ బెల్లంకొండ లాక్‌డౌన్‌లో కర్నూలుకు వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే ఆయనొక్కడే కాకుండా సాయి గణేష్, బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ పద్మలతో పాటు వెళ్లారు. ఆ అభిమానికి గోల్డ్ రింగ్ కూడా గిఫ్ట్…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ “ఛత్రపతి” రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జయంతిలాల్ గడా ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా కోసం మేకర్స్ ఓ భారీ విలేజ్ సెట్ ను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలో ఈ సెట్ నిర్మాణం జరుగుతోందట. ఈ రీమేక్ మొదటి షెడ్యూల్ జూలై మొదటి వారం నుండి ఈ…