Belagavi: కర్ణాటక-మహారాష్ట్రల మధ్య మరోసారి ‘‘భాష’’, ‘‘సరిహద్దు’’ వివాదం రాజుకుంది. ఇటీవల కర్ణాటక సరిహద్దు జిల్లా బెళగావిలో మరాఠీ మాట్లాడలేదని కేఎస్ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై కొందరు దాడి చేశారు.
Belagavi: కర్ణాటక నగరమైన బెగళావిలో మరాఠీ మాట్లాడని కారణంగా బస్సు కండక్టర్‌ని కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో కండక్టర్ గాయపడ్డారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రాంతమైన ‘‘బెళగావి’’పై ఇరు రాష్ట్రాల మధ్య గత కొన్ని ఏళ్లుగా వివాదం ఉంది.
Congress: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ రాజ్యాంగంపై దాడి ప్రధాన ప్రతిపక్షం, విపక్షాల మధ్య రాజకీయ పోరుకు దారి తీసింది. దీంతో ఈరోజు (జనవరి 21) కర్ణాటకలోని బెలగావిలో జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ ర్యాలీతో కాంగ్రెస్ ప్రారంభించనుంది.
Karnataka: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత పోరు కేవలం కాంగ్రెస్ పార్టీలోనే అనుకున్నాం.. కానీ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో లుకలుకలు మొదలు అయ్యాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రపై గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కర్నాటకలోని బెల్గాంలో జరుగుతున్న సీడబ్ల్యుసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో.. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ నుంచి మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌లకు దక్కింది.
Congress: బీజేపీపై మరింతగా దాడి చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. స్వాతంత్ర్య సమరయోధులను అవమానించిందని, రాజ్యాంగాన్ని అణగదొక్కారని ఆరోపిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది.
Sonia Gandhi: మహాత్మా గాంధీ వారసత్వం ముప్పులో ఉందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈ రోజు అన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న వారు, వారికి మద్దతు ఇచ్చే సంస్థల నుంచి మహాత్మా గాంధీ వారసత్వం ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. పరోక్షంగా బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్‌పై సోనియా గాంధీ దాడి చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో గాంధీ సిద్ధాంతాలు, సంస్థలు దాడులకు గురవుతున్నాయని అన్నారు. ఈ శక్తుల్ని ఎదుర్కోవడానికి మన సంకల్పాన్ని పునరుద్ధరించడం…
CWC meeting: కర్ణాటకలోని బెలగావిలో నేడు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నవ సత్యాగ్రహ భైఠక్‌గా నామకరణం చేశారు. ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలతో పాటు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారు.
Belagavi: మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటకలోని బెలగావి నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన (యూబీటి) నేత ఆదిత్య ఠాక్రే డిమాండ్ చేశారు. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ఇది చిన్న పిల్లల ప్రకటనలా ఉందన్నారు.
Karnataka: తల్లికూతుళ్లు ఇద్దరు వ్యభిచారం చేస్తు్న్నారని ఆగ్రహించిన ఇరుగుపొరుగు వారిపై దారుణంగా ప్రవర్తించారు. ఇద్దరిని ఇంటిని నుంచి బయటకులాగి కొట్టారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. వ్యభిచార రాకెట్ నడుపుతున్నారని ఆరోపిస్తూ.. 60,29 ఏళ్ల వయసు కలిగిన తల్లికూతుళ్లతపై దాడి చేశారు. వారి బట్టలు చింపేసి దారుణంగా కొట్టారని పోలీసులు తెలిపారు.