ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ అజెండాపై అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించింది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, కీలక బిల్లుల ఆమోదానికి మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలను ప్రభుత్వం కోరింది. అఖిలపక్ష సమావేశానికి టీడీపీ తరపున బీద మస్తాన్ రావు, వైసీపీ తరపున మిథున్ రెడ్డి, జనసేన తరపున బాలశౌరి హాజరయ్యారు.
టీడీపీ రాజ్యసభ సభ్యులను ఖరారు చేసింది. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేసింది. ఆర్.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
గత ఎన్నికల్లో టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు ఇటీవల సీఎం జగన్ రాజ్యసభ సీటు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే బీద మస్తాన్‌రావు రాజ్యసభ సీటును డబ్బులిచ్చి కొనుక్కున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీద మస్తాన్‌రావు స్పందించారు. డబ్బులిస్తే రాజ్యసభ సీటు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. డబ్బులకే రాజ్యసభ సీట్లు దక్కుతాయనుకుంటే రూ.100 కోట్లు కాదు.. రూ.200 కోట్లు కూడా ఇచ్చేందుకు చాలా మందే ఉన్నారని బీద మస్తాన్‌రావు…
ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక పూర్తయింది. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. తొలుత ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వైసీపీ ముందునుంచీ బలహీనవర్గాలకు పెద్ద పీట వేస్తుందని జగన్ నిరూపిస్తున్నారు. బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. నాలుగింట సగం స్థానాలు బలహీన వర్గాలకే ఇచ్చారు.…
ఏపీలో ఉత్కంఠ రేపుతున్న రాజ్యసభ ఎన్నికల అభ్యర్ధుల ఖరారు పూర్తయింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావులకు అవకాశం ఇచ్చారు. బలహీన వర్గాలకు సముచిత స్థానం ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంనుంచి ఖాళీ అయిన నాలుగు స్థానాలకు అభ్యర్ధుల్ని ఫైనల్ చేశారు. నాలుగింట సగం స్థానాలు బలహీన వర్గాలకే ఇచ్చారని, ఈ స్థాయిలో బలహీన వర్గాలకు…