Andhra Pradesh: టీడీపీ రాజ్యసభ సభ్యులు ఖరారు
- టీడీపీ రాజ్యసభ సభ్యులు ఖరారు
- సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లు ఖరారు చేసిన టీడీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: టీడీపీ రాజ్యసభ సభ్యులను ఖరారు చేసింది. సానా సతీష్, బీద మస్తాన్ రావు పేర్లను టీడీపీ ఖరారు చేసింది. ఆర్.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బీద మస్తాన్ రావు.. గత ప్రభుత్వంలో రాజ్యసభ ఎంపీ.. వైసీపీ నుంచి జంప్ చేసి 2024 రాష్ట్ర జనరల్ ఎలక్షన్ల సమయానికి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బీద మస్తాన్ రావు ఒక వ్యాపారవేత్త.. అలాగే కచ్చితంగా తన రాజ్యసభ ఎంపీ స్థానం తనకే ఉంటుందనే హామీ తీసుకుని పార్టీ మారినట్లు తెలిసింది. బీద మస్తాన్ రావు 2009లో కావలి నుంచీ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత రెండు పర్యాయాలు ఓటమి పాలయ్యారు. అయితే క్రియాశీలక రాజకీయాలలో లేని బీద మస్తాన్ రావును 2022లో వైసీపీ నుంచి రాజ్యసభకు పంపించారు… 2024లో వైసీపీకి, రాజ్యసభకు కూడా బీద మస్తాన్ రావు రాజీనామా చేసారు. అయితే టీడీపీ నుంచి బలమైన ప్రామిస్ ఇవ్వడంతో టీడీపీ తరఫున రాజ్యసభకు వెళ్ళడానికి బీదా మస్తాన్ రావు నిర్ణయించుకున్నారు. తాజాగా టీడీపీ కూడా రాజ్యసభకు ఖరారు చేయడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే కాకనాడ ఎంపీ స్థానాన్ని ఆశించి వదులుకున్న సానా సతీష్‌కు కూడా రాజ్యసభ స్థానాన్ని టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది.
Read Also: Home Minister Anitha: డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్.. ఆ నెంబర్ నుంచే హోంమంత్రికి కూడా!
Also Read
ఆర్.కృష్ణయ్య తెలంగాణా నుంచీ వచ్చినా.. ఆయనను రాజ్యసభకు పంపించింది గత వైసీపీ ప్రభుత్వం … అయితే ఆర్.కృష్ణయ్య మొదటగా బీసీ నాయకుడు.. అలాగే రాజకీయాల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎల్బీ నగర్ నుంచి 2014లో పోటీ చేసి గెలిచాడు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు.. ఆ తరువాత వైసీపీ ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపించింది.. 2024లో ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు, వైసీపీకి రాజీనామా చేసారు.. అయితే బీసీ ఉద్యమ నాయకుడు కావడం.. బీజేపీకి బీసీలలో కచ్చితంగా ఓటు బ్యాంకు పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో ఆర్.కృష్ణయ్యను దగ్గర చేసుకున్నారు. అలాగే బీజేపీ రాబోయే కాలంలో క్షేత్రస్ధాయిలో బలపడాలంటే సామాజికవర్గ సమీకరణాలను పూర్తిగా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.. దీనిలో బీసీలలో బీజేపీని చొప్పించడానికి ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చి బీజేపీ కండువా కప్పారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎవరనేది ఫైనల్ కావడంతో ఏపీ నుంచి ఆ ముగ్గురి నామినేషన్లు ఏకగ్రీవం కానున్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!