ఐపీఎల్ 2025 క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. రసవత్తరంగా సాగిన ఐపీఎల్ జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో క్రికెట్ లవర్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. కాకినాడ లో ఐపీఎల్ మ్యాచ్ లు చూడడానికి ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసింది బిసిసిఐ. జూన్ 1, 3 తేదీలలో జరిగే సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ చూడడానికి ఐపీఎల్ ఫ్యాన్…
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఓటముల నేపథ్యంలో ఇద్దరు వీడ్కోలు పలికారు. ఈ రెండు సిరీస్‌ల అనంతరం ఆటగాళ్ల స్థాయిలోనే కాకుండా కోచింగ్ బృందంలో కూడా చాలా మార్పులు జరిగాయి. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌లను గత నెలలో వారి…
IPL 2025 Final: ఐపీఎల్ 2025 తుది దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి తుది పోరు మరింత ప్రత్యేకంగా కనిపించబోతుంది. ఇందుకోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ను విజయవంతం చేసిన మన భద్రతా దళాలను ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సత్కరించాలని ప్లాన్ చేసింది.
ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు శనివారం ప్రకటించనున్నారు. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఎవరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పోటీలో ఉన్నారు. అయితే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను గిల్‌కే అప్పగించేందుకు బీసీసీఐ సిద్ధమైందని తెలుస్తోంది. ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌ను ప్లేఆఫ్స్ చేర్చడం అతడికి కలిసి రానుంది. దీనిపై మరికొన్ని గంటల్లో…
త్వరలోనే పెళ్లి.. ఇంతలో దుండగుడి కాల్పుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి ఆ జంట అందమైన జంట. చూడముచ్చటైన జంట. చిలకాగోరింకల్లా ఉన్నారు. వివాహం అనే బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని కలలు కన్నారు. కోరుకున్న చెలిమి దొరికిందని ఎంతగానో మురిసిపోయాడు. జెరూసలేంలో ఆమెకు ప్రపోజ్ చేసేందుకు ఉంగరం కూడా తీసుకున్నాడు. కానీ అంతలోనే మృత్యువు ఎదురొస్తుందని ఊహించలేకపోయాడు. ఓ దుర్మార్గుడు అకస్మాత్తుగా వచ్చి కాల్పులకు తెగబడడంతో అక్కడికక్కడే జంట నేలకొరిగింది. ఈ విషాద ఘటన వాష్టింగ్టన్‌లోని…
వచ్చే నెలలో ఇంగ్లండ్, భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ప్రకటించనుంది. సీనియర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. జట్టులో యువకులకు అవకాశం దక్కనుంది. భారత్-ఏ తరఫున ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న వారిలో కూడా టీమిండియాలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు. అయితే కీలక టెస్ట్ సిరీస్ ముందు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ…
India U19: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) త్వరలో జరిగే ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును ప్రకటించింది. ఈ పర్యటనలో జూన్ 24 నుంచి జూలై 23 వరకు ఐదు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ సిరీస్‌కు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2025 సీజన్లో మంచి ప్రతిభ చూపిన అయుష్ మ్హాత్రేను కెప్టెన్‌గా నియమించారు. అలాగే అభిగ్యాన్ కుండును వైస్-కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఐపీఎల్ 2025లో…
లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన IPL 2025 మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దిగ్వేష్ సింగ్ రాఠి అభిషేక్ శర్మతో వాగ్వాదానికి దిగాడు. వీరిద్దరి వ్యవహారంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఇద్దరు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది.ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దిగ్వేష్ రాఠిపై ఒక మ్యాచ్ నిషేధం, 50% జరిమానా విధించింది. అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25%…
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను ఒంటరిని చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. సరిహద్దులో ఇటీవలి ఘర్షణల తర్వాత పాకిస్తాన్‌ను ఒంటరిని చేసే ప్రయత్నంలో బీసీసీఐ కఠిన వైఖరి తీసుకున్నట్లు సమాచారం. ఈ చర్యలు రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై దీర్ఘకాలిక, శాశ్వత ప్రభావాన్ని చూపనున్నాయి. భారతదేశం మరియు పాకిస్తాన్ ఇప్పటికే ద్వైపాక్షిక క్రికెట్ ఆడేది లేదని తేల్చేసినప్పటికీ.. రెండు దేశాల మధ్య ప్రస్తుత రాజకీయ సంబంధాలు రెండు జట్ల మధ్య బహుళ-జట్టు ఈవెంట్లను కూడా ప్రమాదంలో…
Virat Kohli-Bharat Ratna: భారత క్రికెట్‌కు తన జీవితాన్ని అంకితం చేసిన విరాట్ కోహ్లీకి భారత రత్న అవార్డును ఇవ్వాలని టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కోరారు. కొద్ది రోజుల క్రితమే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ, తన ఫ్యాన్స్‌కు ఓ తీపి జ్ఞాపకంగా ఢిల్లీ వేదికగా ఒక రిటైర్మెంట్ మ్యాచ్ నిర్వహించాలని రైనా అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ మే 12న టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌ల్లో 9230…