IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ చివరి దశకు చేరుకుంటున్న సమయంలో విదేశీ ఆటగాళ్ల లభ్యత కీలక సమస్యగా మారింది. మే 9న లీగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేయడంతో అనేక విదేశీ ఆటగాళ్లు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోయారు. దీంతో ప్లేఆఫ్ దశకు చేరిన పలు ఫ్రాంచైజీలకు తమ ముఖ్య ఆటగాళ్లను కోల్పోయే ప్రమాదం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ విదేశీ ఆటగాళ్లను తిరిగి భారత్‌కి రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది.…
ఇంగ్లాడ్ పర్యటనకు ముందు క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే అతడు కూడా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు.
IPL In Hyderabad: ఐపీఎల్ 2025 మే 17 నుంచి మళ్లీ ప్రారంభమవుతున్నట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మే 8న ఐపీఎల్ నిలిపివేయబడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభుత్వ వర్గాలు, భద్రతా సంస్థలు, టోర్నీ నిర్వాకులతో విస్తృతంగా చర్చించిన అనంతరం మళ్లీ టోర్నీ కొనసాగించేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే కొత్త షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. Read Also:…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మే 17 నుండి తిరిగి ప్రారంభమవుతుందని భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సోమవారం రాత్రి తెలిపింది. తొలి మ్యాచ్ ఈ నెల 17న బెంగళూరు, కోల్‌కతా మధ్య జరుగుతుంది. కొత్త షెడ్యూలు ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరుగుతుంది. మే 29న క్వాలిఫైయర్-1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా మే 8న ఐపీఎల్ 2025 నిలిచిపోయిన…
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తిరిగి ప్రారంభమవుతుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తో సహా పలు ప్రముఖ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు మళ్లీ భారత్‌కు రావడం అనుమానంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం నిలిపివేయబడ్డ ఐపీఎల్‌ను మే 16న తిరిగి ప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ.. మే 30న ఫైనల్ జరపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్ సస్పెండ్ అయిన వెంటనే స్టార్క్ తన భార్య అలిస్సా హీలీతో కలిసి సిడ్నీ…
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటనతో ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. ప్రభుత్వం అనుమతిస్తే.. ఐపీఎల్ 2025 మే 16 లేదా 17న ఆరంభమయ్యే అవకాశముంది. ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణపై పాలకవర్గ సభ్యులు, బీసీసీఐ అధికారులు ఆదివారం సుదీర్ఘంగా చర్చించారు. బీసీసీఐ రీషెడ్యూలును సిద్ధం చేసే పనిలో ఉందని ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఓ ప్రకటలో తెలిపారు.…
ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోవాలనుకుంటున్నాడు. తాను టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నానని, ఇంగ్లండ్ పర్యటనకు తనను ఎంపిక చేయొద్దని తాజాగా బీసీసీఐకి కోహ్లీ సమాచారం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టులకు దూరమైన నేపథ్యంలో విరాట్ కూడా తప్పుకొంటే ఇంగ్లండ్ పర్యటనలో అనుభవ లేమి భారత జట్టును దెబ్బ తీస్తుందని బీసీసీఐ భావిస్తోంది.…
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పాక్ వరుస క్షిపణి, డ్రోన్ దాడులను చేయగా.. దీనికి భారత సైన్యం దీటైన సమాధానం ఇచ్చింది. అయితే మే 8న జరిగిన దాడుల కారణంగా ధర్మశాలలో ఐపీఎల్ 2025 మ్యాచ్ కూడా ప్రభావితమైంది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను మధ్యలో ఆపేసి.. రద్దు చేశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాలీవుడ్…
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు వారం పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. శనివారం కాల్పుల విరమణ అంగీకారంతో.. భారత్, పాక్ మధ్య యుద్ధం ముగిసింది. యుద్ధం ముగియడంతో ఐపీఎల్ 2025ను పునఃప్రారంభించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు మొదలెట్టింది. భారత ప్రభుత్వం టోర్నీకి అనుమతిస్తే.. మే 15 లేదా 16న ఐపీఎల్ పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మే 30న ఐపీఎల్ 2025 ఫైనల్ జరగనుందని తెలుస్తోంది. ఈరోజు రాత్రికి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం…
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇంగ్లాడ్ పర్యటనకి ముందు హిట్‌మ్యాన్ టెస్టుల నుంచి వైదొలగడంతో ఇప్పుడు బీసీసీఐ రెండు విషయాపై దృష్టి సారించింది. ప్రస్తుతం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టెస్ట్ సారధిని ఎంపిక చేసే పనిలో ఉంది. ఇప్పటికే టీమిండియా కొత్త కెప్టెన్ విషయంలో సెలక్షన్ కమిటీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ పేరు వినిపిస్తోంది.…