BCCI Invites Bids for Team India Sponsorship: ఆన్లైన్ గేమింగ్ చట్టం 2025 పార్లమెంట్లో ఆమోదం పొందిన నేపథ్యంలో టీమిండియా టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి ‘డ్రీమ్ 11’ వైదొలిగిన విషయం తెలిసిందే. దాంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్‌ను వెతుక్కునే వేటలో పడింది. ఇందులో భాగంగానే మంగళవారం దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. టీమిండియా స్పాన్సర్ షిప్ కోసం బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆసక్తి గల కంపెనీలు పలు నియమ, నిబంధనలకు లోబడి ఉండాలని…
BCCI Confirms Standby Players Will Not Travel to Dubai: యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి మొదలు కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్, హాంకాంగ్ టీమ్స్ తలపడనున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆసియా కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే 15 మందితో కూడిన జట్టును ప్రకటించగా.. అందరూ టోర్నీ కోసం సన్నద్ధమవుతున్నారు. మెగా టోర్నీ కోసం టీమిండియా ప్లేయర్లు సెప్టెంబర్ 4న…
Mohammed Shami React On Team India Selection: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతానికి భారత జట్టులో చోటు దక్కించుకునే విషయమై తనకు ఎలాంటి ఆశలూ లేవు అని తెలిపాడు. ఒక వేళ అవకాశం ఇస్తే మాత్రం తన పూర్తి శక్తి, సామర్థ్యాలతో ఆడటానికి ప్రయత్నిస్తా అని చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు తాను అందుబాటులోనే ఉన్నానని, సెలక్షన్ అనేది నా చేతిలో లేని వ్యవహారం అని పేర్కొన్నాడు. ఇటీవల…
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేనప్పుడు తాను మరింత మెరుగ్గా రాణిస్తా అని హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు. బుమ్రా లేనపుడు తనపై బౌలింగ్ బాధ్యత ఉంటుందని, ఆ సమయంలో మెరుగ్గా రాణించడానికి ప్రయత్నిస్తా అని చెప్పాడు. బాధ్యత తనలో ఆనందాన్ని రేకెత్తిస్తుందని, అలానే ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుందన్నాడు. సహచర బౌలర్లతో ఎప్పుడూ మాట్లాడుతానని, మనం సాధించగలమనే నమ్మకాన్ని వారిలో కలిగించేందుకు కృషి చేస్తా అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025, ఇటీవలి ఇంగ్లండ్…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. హిట్‌మ్యాన్ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని చూస్తున్నాడు. ఎందుకంటే.. వన్డే ప్రపంచకప్ రోహిత్ కల అని తెలిసిందే. టీ20, టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు పూర్తిగా వన్డేలపై మాత్రమే దృష్టి పెట్టాడు. అయితే రోహిత్‌ను టీమ్ నుంచి తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశాడు.…
Goenka Jokes on Team India Jersey Sponsor: భారత జట్టు జెర్సీ స్పాన్సర్ ‘డ్రీమ్ 11’తో బీసీసీఐ తన ఒప్పందాన్ని మధ్యలోనే రద్దు చేసుకుంది. ఆన్లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇకపై ఇలాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోమని బీసీసీఐ స్పష్టం చేసింది. టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా మూడేళ్ల కాలానికి డ్రీమ్ 11 రూ.358 కోట్ల ఒప్పందంను బీసీసీఐతో కుదుర్చుకుంది. కానీ ఉన్నపళంగా ఈ ఒప్పందాన్ని మధ్యలోనే…
BCCI Terminates Dream 11 Sponsorship Deal: భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ ‘డ్రీమ్ 11’తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒప్పందంను రద్దు చేసుకుంది. ఆన్లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన నేపథ్యంలో.. బీసీసీఐ సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ ఇలాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోమని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా తెలిపారు. కొత్త చట్టం కారణంగా ఒప్పందాన్ని కొనసాగించలేమని డ్రీమ్ 11 ప్రతినిధులకు బీసీసీఐ…
Cheteshwar Pujara: టీమిండియాకు ఎన్నో గొప్ప విజయాలు అందించిన ప్రముఖ ఆటగాడు చతేశ్వర్ పుజారా తన 20 ఏళ్ల క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికాడు. తాజాగా ఆయన అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. గత కొంతకాలంగా పుజారా టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. చివరిసారి 2023లో ఆస్ట్రేలియాతో లండన్‌లోని ది ఓవల్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పుజారా ఆడాడు. ఆ తర్వాత నుంచి భారత జట్టులోకి ఆయనకు తిరిగి వచ్చే అవకాశాలు కనిపించలేదు. నిజానికి ఆస్ట్రేలియా పర్యటనలో…
BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వివిధ పోస్టుల కోసం కొత్త నియామకాలను ప్రకటించింది. ఇందులో జాతీయ సెలెక్టర్ పోస్టులతో పాటు మహిళా, జూనియర్ సెలెక్షన్ కమిటీల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కి ఒక సంవత్సరం కాలపరిమితి పొడిగించి ఆయన కాంట్రాక్ట్ జూన్ 2026 వరకు కొనసాగించగా.. మిగతా సభ్యుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన వారికి BCCI నుంచి లక్షల్లో జీతం అందించనుంది. ఇందుకు సంబంధించి BCCI తన…