HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులు 14 రోజుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులను మరింతగా విచారించాల్సిన అవసరం ఉందంటూ, తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) కస్టడీ పిటిషన్‌ను మల్కాజ్గిరి కోర్టులో దాఖలు చేసింది. సీఐడీ తమ పిటిషన్లో నిందితులను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. ఈ…
ఓ క్రీడా జర్నలిస్ట్ ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌లో యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ భారత వన్డే జట్టుకు వచ్చే సిరీస్ నుంచే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారని అందులో రాసుకొచ్చాడు. ఇప్పటికే టెస్ట్‌లలో టీమిండియా నాయకత్వ బాధ్యతలు చేపట్టిన గిల్.. ఇప్పుడు వన్డే కెప్టెన్సీకి కూడా అందుకోనున్నాడా? అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
HBD Sourav Ganguly: భారత క్రికెట్లో “దాదా” అనగానే గుర్తొచ్చే పేరు సౌరవ్ గంగూలీ. భారత జట్టును విదేశీ గడ్డపై గెలవడం ఎలా అనే విషయాన్ని నేర్పించిన నాయకుడు. భారత్ అంటే ఇంట్లోనే జైత్రయాత్ర చేసే జట్టు.. అనే ముద్రను తొలగించిన కెప్టెన్. జూలై 8, 1972న కోలకతాలో జన్మించిన గంగూలీ నేడు 54వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన విశేషాలను గుర్తు చేసుకుందాము. సౌరవ్ గంగూలీ.. 1997లో వరుసగా…
వచ్చే ఆగస్టులో జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ధ్రువీకరించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), బీసీసీఐ సంయక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త షెడ్యూల్‌ను తరువాత విడుదల చేస్తామని బీసీసీఐ పేర్కొంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 2026లో నిర్వహించేందుకు బీసీబీ సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక హింసాత్మక…
క్రికెట్లో టీమిండియా ఎక్కడ ఆడినా ఆదరణ లభిస్తుంది. మరి ముఖ్యంగా ఆసియా కప్ లాంటి టోర్నమెంట్లలో అయితే ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. దానికి కారణం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అవును ఆసియాకప్ లో ఇరుజట్లు 2 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరింత రసవత్తరంగా సాగుతుంది.పైగా ఆసియాలోనే ఇవి రెండు బలమైన జట్లు. అందుకే రెండు లేదా 3 సార్లు తలపడే ఛాన్స్ ఉంటుంది. నిజంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ కిక్కే…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్స్ దర్శనమిస్తున్నాయి. ఐపీఎల్ సక్సెస్ తరువాత దాదాపు ప్రతి దేశం ఈ లీగ్స్ ని జరుపుతున్నాయి. ఇక ఇండియాలో అయితే ప్రతి స్టేట్, వాళ్ళ ప్లేయర్లను పరిచయం చేయటానికి లీగ్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్స్ ఏకంగా 25 పైనే ఉన్నాయి.
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ లో 5 టెస్ట్ మ్యాచ్‌లు సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వేదికగా జరగబోయే వన్డే మరియు టీ20 సిరీస్ ఆడుతుంది. ఇప్పుడు దానిపై నీలినీడలు కమ్ముకున్నాయి.అసలు ఈ సిరీస్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. దానికి కారణం అక్కడి పరిస్థితులే. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో 3 వన్డేలు మరియు 3 టీ20లు ఆడనుంది. అయితే భారత ప్రభుత్వం నుండి ఇంకా అనుమతి…
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో టీమిండియా ఓటమిని చవిచూసింది. జులై 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడని తెలుస్తోంది. వర్క్‌లోడ్ నేపథ్యంలో బుమ్రా టెస్ట్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాడు. తాను అన్ని మ్యాచ్‌లు ఆడలేనని సిరీస్‌కు ముందే బుమ్రా చెప్పగా.. అందుకు బీసీసీఐ ఒకే చెప్పింది. బీసీసీఐపై…
ఐపీఎల్ 2025 సీజన్లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలిసారిగా టైటిల్ గెలుచుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలుచుకోవడంతో.. బెంగళూరులో విక్టరీ పరేడ్, చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ చేశారు. అయితే ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగి.. 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా…
Anderson–Tendulkar Trophy: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ లకు ప్రతిష్టాత్మక గుర్తింపుగా “ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ” గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సంబంధించిన ట్రోఫీను తాజాగా ఆండర్సన్, టెండూల్కర్ లు ఆవిష్కరించారు. ఈ ట్రోఫీ 2007 నుంచి 2024 వరకు ఉన్న పటౌడి ట్రోఫీకి ప్రత్యామ్నాయంగా ఉండనుంది. ఈ కొత్త ట్రోఫీలో టెండూల్కర్‌కు చెందిన క్లాసిక్ కవర్ డ్రైవ్, అలాగే అండర్సన్‌కు చెందిన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ ఉన్న చిత్రాలను పొందుపరిచారు. వీరిద్దరి సంతకాలు…