IPL 2025: నేడు భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. మరో రెండు రోజులలో IPL 2025 సీజన్ సంబంధిత మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించబడుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేలం ప్రారంభం కాకముందే ఐపీఎల్ తదుపరి సీజన్ తేదీని వెల్లడించారు. ఐపీఎల్ 2025 సీజన్ ఎప్పుడు మొదలవుతుంది, ఎంతకాలం కొనసాగుతుంది అనేది వెల్లడైంది. IPL 2025 సీజన్ మునుపటి…
Devdutt Padikkal In BGT: మరో 24 గంటల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024 – 25 ప్రారంభమవుతుంది. అయితే, దీనికి ముందు టీమిండియాలో గాయం ఆందోళన అభిమానులను టెన్షన్ పెంచింది. ఇది ఇలా ఉండగా.. నవంబర్ 22న ప్రారంభమయ్యే పెర్త్ టెస్టుకు ముందు బీసీసీఐ పెద్ద ప్రకటన చేసింది. గాయపడిన శుభమాన్ గిల్ స్థానంలో కొత్త ఆటగాడికి జట్టులో అవకాశం లభించింది. ఇంగ్లండ్‌తో జరిగిన అరంగేట్రంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన దేవదత్ పడిక్కల్‌ను…
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. వేలానికి 1,574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. 574 మందిలో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి 10 ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. వేలంలో ఈసారి టీమిండియా స్టార్స్ ఉండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఎవరు ఎంత ధరకు అమ్ముడవుతారని ఎదురుచూస్తున్నారు. ఈ…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో సందిగ్థత వీడడం లేదు. ఓవైపు ఆతిథ్యం విషయంలో పాకిస్థాన్ మొండిగా ఉండగా.. మరోవైపు పాక్‌కు వెళ్లి ఆడేందుకు భారత్ సిద్ధంగా లేదు. టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తేనే పాల్గొంటామని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పగా.. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని పీసీబీని అంతర్జాతీయ క్రికెట్ మండలి కోరింది. ఈ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకోవడం లేదు. సోమవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆధునీకీకరణ పనులను పరిశీలించిన పీసీబీ ఛైర్మన్ మొహసీన్ నఖ్వీ…
ప్రతిష్టాక టోర్నీ ముందు భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. మొదటి టెస్టు ముందు.. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మోచేతికి దెబ్బ తగలడంతో కేఎల్ రాహుల్ ఇబ్బంది పడుతుండగా.. తాజాగా శుభ్‌మన్ గిల్ కు కూడా గాయపడ్డాడు.
హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించేదే లేదని తెలిపిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా భారీ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. భారత్ ఆతిథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై అటు ఐసీసీ కానీ.. బీసీసీఐ కానీ ఎలాంటి ప్రకటనా వెల్లడించలేదు.
Champions Trophy 2025: వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వడంపై సంక్షోభ మేఘాలు కమ్ముకున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత క్రికెట్ బోర్డు (BCCI) తన జట్టును పాకిస్తాన్‌కు పంపడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో మొత్తం టోర్నమెంట్ దేశం వెలుపల నిర్వహించబడుతుందనే ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే, మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రషీద్ లతీఫ్ మాట్లాడుతూ.. ఏ టోర్నీలోనూ పాకిస్థాన్‌ను భారత్‌తో ఆడేందుకు అనుమతించేది లేదని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్…
IND vs AUS: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. స్టార్ ప్లేయర్ మహ్మద్ షమీ మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. చీలమండకు గాయం కారణంగా దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరమైన మహ్మద్ షమీ రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం మధ్యప్రదేశ్‌తో జరిగే తమ తదుపరి రౌండ్ రంజీ మ్యాచ్‌లో షమీ బెంగాల్ తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య టోర్నీ జరగనుంది. కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పీసీబీ షెడ్యూల్‌ను సిద్ధం చేసి ఐసీసీకి పంపగా.. బీసీసీఐ కారణంగా డేట్స్ ఇంకా విడుదల కాలేదు. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం కొనసాగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం… పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయంపైనే…
ఇటీవలి కాలంలో సొంతగడ్డపై భారత్ రెండు టెస్టు సిరీస్‌లను ఆడింది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులను, న్యూజిలాండ్‌తో మూడు టెస్టులను ఆడింది. బంగ్లాదేశ్‌పై 2-0 తేడాతో సిరీస్ గెలిచిన టీమిండియా.. న్యూజిలాండ్‌పై మాత్రం ఘోర పరాజయంను చవిచూసింది. ఈ ఐదు టెస్టులు జరిగిన పిచ్ రిపోర్ట్‌లను తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. ఇందులో ఒక్క పిచ్‌కు మాత్రమే మంచి రేటింగ్ వచ్చిందట. మిగతా నాలుగు పిచ్‌లు మాత్రం పాస్ అయినట్లు తెలుస్తోంది. Also Read: Venu…