Jasprit Bumrah-Ishan Kishan: జస్ప్రీత్ బుమ్రా యార్కర్.. ఇషాన్ కిషన్‌కు భారీ గాయం, డౌటే ఇగ (వీడియో)!
- నెట్స్ ప్రాక్టీస్ సందర్భంగా బుమ్రా యార్కర్
- ఇషాన్ కిషన్‌కు భారీ గాయం
- కిషన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah Yorker Injures Ishan Kishan: టీ20 ప్రపంచకప్ 2026 లో నమీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. నెట్స్ ప్రాక్టీస్ సందర్భంగా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్ నేరుగా అతడి ఎడమ కాలి బొటనవేలికి తాకింది. దాంతో కిషన్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స చేయగా కాస్త కుదుటపడ్డాడు. నెట్ సెషన్ నుంచి బయటకు వెళ్లిపోయిన కిషన్.. కాసేపటికి మైదానంలోకి తిరిగి వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇషాన్ కిషన్ గాయం తీవ్రతపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు. టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం అతని ఫిట్‌నెస్‌పై ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశముంది. నమీబియా చిన్న జట్టే కాబట్టి.. అవసరమైతే అతడికి విశ్రాంతి ఇవ్వొచ్చని తెలుస్తోంది. అభిమానులు కిషన్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనతో జట్టు ప్రాక్టీస్ సెషన్లలో కూడా ఎంతటి రిస్క్ ఉంటుందో మరోసారి స్పష్టమైంది.
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
- Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
- Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
Also Read: T20 WC 2026 Views: 15 మ్యాచ్‌లకు 875 మిలియన్ వ్యూస్, భారత్ మ్యాచ్ వ్యూస్ తెలిస్తే మెంటలెక్కుద్ది!
టీమిండియాను గాయాలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఓపెనర్ అభిషేక్ శర్మ గత మూడు రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి కోలుకుంటున్నాడు. నమీబియా మ్యాచ్‌లో అభిషేక్ ఆడడం లేదు. పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ 2026 మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. గాయంతో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అమెరికాతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. తీవ్ర జ్వరం కారణంగా అమెరికా మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఆడలేదు. తిలక్ వర్మ కూడా గాయం నుంచి కోలుకున్న విషయం తెలిసిందే.
🚨ISHAN KISHAN INJURED.🚨
The moment when Ishan Kishan got injured by Bumrah’s fast yorker at the nets.😳pic.twitter.com/PnFBlpRjxL
— Sam (@Cricsam01) February 12, 2026
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!