స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు భారత్ సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ రెండు సిరీస్‌లకు బీసీసీఐ సెలెక్టర్లు జట్లను ప్రకటించనున్నారు. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే జట్టునే.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడించే అవకాశం ఉంది. అయితే న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మను జట్టుకు ఎంపిక చేస్తారా? లేదా? అనేది అనుమానంగా ఉంది. దీనిపై బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఫామ్ లేమి కారణంగా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు…
టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శల వర్షం కురిపించారు. గిల్ ఓవర్ రేటెడ్ క్రికెటర్ అని పేర్కొన్నారు. గిల్‌కు ఇన్ని అవకాశాలు లభిస్తున్నప్పుడు.. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లకు టెస్టుల్లో ఎక్కువ ఛాన్స్‌లు ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. జాతీయ జట్టుకు ఆడే అర్హత ఉన్న ఆటగాళ్లను బీసీసీఐ సెలక్టర్లు విస్మరిస్తున్నారని శ్రీకాంత్ ఫైర్ అయ్యారు. యువ ప్లేయర్లను సెలక్టర్లు ప్రోత్సహించాలని సూచించారు. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్…
రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్లు చేస్తున్నారు. దీంతో అతను కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదో టెస్టు మ్యాచ్ తర్వాత టెస్టు కెరీర్‌కు గుడ్ బై చెప్పాలని టీమిండియా సారథి రోహిత్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది..
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌లో నాలుగో మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 68 పరుగులతో, పాట్ కమిన్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. READ MORE: Telangana DGP: పోలీసులు వద్దంటే వినాలి.. సినీ ప్రముఖులతో డీజీపీ.. ఆసీస్…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యంపై అనిశ్చితి వీడిన విషయం తెలిసిందే. బీసీసీఐ కోరిక మేరకు హైబ్రిడ్ మోడల్లోనే టోర్నీ జరిపేందుకు పీసీబీ అంగీకరించింది. అయితే పీసీబీ కోరినట్లుగా 2024-27 మధ్య ఐసీసీ ఈవెంట్లలో ఇండో, పాక్ మ్యాచ్‌లు.. భారత్ లేదా పాకిస్థాన్‌లో ఎక్కడ జరిగినా తటస్థ వేదికలోనే నిర్వహిస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో పర్యటించబోమని ఐసీసీకి బీసీసీఐ తేల్చిచెప్పడంతో.. పీసీబీ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు సిద్దమైంది. Also Read: IND vs WI: మెరిసిన…
BCCI: బోర్డులో ఖాళీ అయిన కీలక పదవుల్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి రెడీ అయింది. ఇందులో భాగంగా.. వచ్చే నెల 12న ముంబైలో ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది.
గత కొన్ని నెలలుగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నట్లు గురువారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికలో జరుగుతాయని ఐసీసీ పేర్కొంది. 2027 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లను పాకిస్తాన్ కూడా తటస్థ వేదికలో ఆడనుంది. ‘2024-2027 మధ్యలో భారత్, పాకిస్తాన్ దేశాల్లో జరిగే ఐసీసీ టోర్నీల్లో ఇరు జట్లు…
Ravichandran Ashwin Retirement: భారత క్రికెట్ దిగ్గజం, ప్రపంచ స్థాయి టాప్ స్పిన్నర్స్ లో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2011లో తన టెస్టు క్రికెట్ ప్రవేశంతో మొదలు అశ్విన్ భారత్ కు అనేక విజయాలు సాధించి, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను తన ఆటతో ఆకట్టుకున్నాడు. ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ చేసిన ప్రయాణం ఎన్నో గొప్ప విజయాలతో నిండింది. టెస్టులలో అతను భారత్ తరఫున అద్భుతమైన ప్రదర్శనలు ఇవ్వడమే కాక.. వన్డే,…
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో బీసీసీఐ మాటే నెగ్గింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి పట్టుబట్టినట్లుగానే హైబ్రిడ్ మోడల్‌తో ఛాపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాలి. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో పర్యటించేది లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది. తాము ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలకు మార్చి.. హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించాలని ఐసీసీని కోరింది. హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ ముందుగా ఒప్పుకోకున్నా.. ఐసీసీ దెబ్బకు దిగొచ్చింది. అయితే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే విషయంపై పీసీబీ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. దీంతో షెడ్యూల్ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఛాంపియన్స్…