ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌కు సంబంధించిన కెప్టెన్ల ఫోటోషూట్ గురువారం (మార్చి 20)న ముంబైలోని ఐకానిక్ గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద జరిగింది. ఈ ఫోటోషూట్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం నిర్వహించారు.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు బౌలర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. సలైవాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో.. ఈ సీజన్లో బౌలర్లు బంతిపై ఉమ్మి (లాలాజలం) వాడకంపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నిర్ణయం బౌలర్లకు కలిసొస్తుంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. రూ.58 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనుంది. ఆటగాళ్లతో పాటు సిబ్బంది, సెలక్షన్ కమిటీకి ఈ నగదు అందజేయనున్నట్లు తెలిపింది.
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 అణాగ్రంగా వైభవంగా మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ప్రారంభం కానుంది. గత సీజన్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ 18వ సీజన్ కావడంతో, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) ఈ లీగ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చేందుకు కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఈసారి ఒక్క కోల్‌కతాలోనే…
బీసీసీఐ నిర్ణయంపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యాడు. క్రికెటర్స్ విదేశీ టూర్లో ఉన్నప్పుడు వారి వెంట కుటుంబ సభ్యులను తీసుకెళ్లొద్దు అంటూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని కోహ్లీతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు తప్పుబట్టారు. ఈ క్రమంలో.. ఈ నిర్ణయాన్ని సవరించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Rohit Sharma: భారత క్రికెట్ జట్టు ఇటీవల టెస్టు క్రికెట్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన సంగతి తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఓటమి, అలాగే ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకోలేకపోవడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత ప్రదర్శన కూడా తివారంగా నిరాశపరిచింది. ముఖ్యంగా, ఆసీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేయడం అతడి బ్యాటింగ్…
త్వరలో ఐపీఎల్ సందడి ప్రారంభం కాబోతుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ పీవర్ మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం.. బీసీసీఐకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎల్ వేదికల్లో పొగాకు, మద్యం ప్రకటనలు, అమ్మకాలకు సంబంధించిన ప్రకటనలు నిషేధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది.
Champions Trophy 2025 : ‘‘ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ ఫైనల్లో భారత క్రికెట్ జట్టు విజయం సాధిస్తుందని 22 మంది పండితులు అంచనా వేశారు. ఈ 22 మంది పండిట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నియమించింది.
విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మాజీ బీసీసీఐ చైర్మన్, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రశంసించారు.
BCCI: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఘోర ఓటమి తర్వాత ప్లేయర్స్, స్టాఫ్‌కు సంబంధించి బీసీసీఐ కఠిన నిబంధనలు విధించింది. ఇకపై క్రికెటర్లు తమ భాగస్వాములు, ఫ్యామిలిని వెంట తీసుకెళ్లడం సహా పలు సౌకర్యాల విషయంలో ఆంక్షలు పెట్టింది.