విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మాజీ బీసీసీఐ చైర్మన్, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రశంసించారు.
BCCI: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఘోర ఓటమి తర్వాత ప్లేయర్స్, స్టాఫ్‌కు సంబంధించి బీసీసీఐ కఠిన నిబంధనలు విధించింది. ఇకపై క్రికెటర్లు తమ భాగస్వాములు, ఫ్యామిలిని వెంట తీసుకెళ్లడం సహా పలు సౌకర్యాల విషయంలో ఆంక్షలు పెట్టింది.
టీమిండియా జెర్సీలపై పాక్ పేరును తొలగించాలంటూ గతంలో పలువురు క్రికెట్ అభిమానులు డిమాండ్ చేసినప్పటికీ.. బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. టోర్నీ సమయంలో క్రికెట్ బోర్డు, భారత జట్టు.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదేశాలకు కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు.
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత్ కు తీవ్ర అవమానం జరిగింది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో భారత జెండా కనిపించకపోవడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇతర దేశాల జెండాలు వేదిక దగ్గర కనిపించినప్పటికీ.. భారత జెండా మాత్రం కనిపించలేదు.
అందరూ ఊహించిందే జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడడం లేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2025 చివరలో గాయపడ్డ బుమ్రా.. ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. వెన్ను గాయం వల్ల బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడని బీసీసీఐ మంగళవారం రాత్రి ఎక్స్‌లో తెలిపింది. అతడి స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జనవరిలో ప్రకటించిన జట్టులో జస్ప్రీత్…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బరిలో దిగుతాడా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. మెగా టోర్నీలో బుమ్రా ఆడడంపై బీసీసీఐ మంగళవారం తుది నిర్ణయం తీసుకోనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేర్పులకు నేటితో గడువు ముగుస్తుండంతో.. బుమ్రాపై ఏదో ఒక నిర్ణయం…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఫ్లడ్ లైట్లు పని చేయకపోవడం వల్ల మ్యాచ్ దాదాపు 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఈ క్రమంలో.. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో బీసీసీఐని విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో.. ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం సీరియస్ అయింది.. వెంటనే చర్యలు చేపట్టింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ కోసం ఇప్పటికే అన్ని టీమ్స్ తమ స్క్వాడ్లను ప్రకటించాయి. స్క్వాడ్‌లో మార్పులు చేసుకొనేందుకు అధికారికంగా ఇంకా మూడు రోజుల గడువు ఉంది. అయితే ఈ ఐసీసీ ట్రోఫీలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా? లేదా? అనేది ఇంకా తెలియరావడం లేదు. స్క్వాడ్‌లో మార్పులు చేసుకొనేందుకు గడువు ముగుస్తున్నా.. బుమ్రా ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ ఓ అంచనాకు రాలేకపోయింది. పేస్…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన సూర్యకుమార్ సేన ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ 4-1 ఆధిక్యాన్ని సాధించింది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఐదో టీ20లో అదగొట్టింది. ఈ మ్యాచ్ లో…
ఈరోజు ఇంగ్లాండ్ తో జరిగే ఐదో టీ20 మ్యాచ్‌కు సంజు శాంసన్ ను పక్కన పెట్టనున్నారు. సంజుకు మరిన్నీ అవకాశాలు ఇవ్వాలని తెలిపిన సంజయ్ మంజ్రేకర్. అతడు ఫాంలోకి వస్తే టీమిండియాకు తిరుగులేదని వెల్లడించారు.