భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు వారం పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. శనివారం కాల్పుల విరమణ అంగీకారంతో.. భారత్, పాక్ మధ్య యుద్ధం ముగిసింది. యుద్ధం ముగియడంతో ఐపీఎల్ 2025ను పునఃప్రారంభించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు మొదలెట్టింది. భారత ప్రభుత్వం టోర్నీకి అనుమతిస్తే.. మే 15 లేదా 16న ఐపీఎల్ పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మే 30న ఐపీఎల్ 2025 ఫైనల్ జరగనుందని తెలుస్తోంది. ఈరోజు రాత్రికి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం…
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇంగ్లాడ్ పర్యటనకి ముందు హిట్‌మ్యాన్ టెస్టుల నుంచి వైదొలగడంతో ఇప్పుడు బీసీసీఐ రెండు విషయాపై దృష్టి సారించింది. ప్రస్తుతం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టెస్ట్ సారధిని ఎంపిక చేసే పనిలో ఉంది. ఇప్పటికే టీమిండియా కొత్త కెప్టెన్ విషయంలో సెలక్షన్ కమిటీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ పేరు వినిపిస్తోంది.…
Test Retirement: ప్రస్తుతం దేశంలో ఉన్న ఉద్రికత్తల మధ్య ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా పడిన సంగంతి తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత జరగబోయే ఇంగ్లాండ్, భారత జట్లు తలపడే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు భారత సెలక్షన్ కమిటీకి సవాళ్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం టెస్టులకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.…
రోహిత్ శర్మ ఇటీవలే టెస్టులకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దాంతో త్వరలో జరిగే ఇంగ్లండ్ పర్యటనకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. యువ ఆటగాడికే టెస్ట్ సారథ్యం అప్పగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ స్థానంలో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తోందట. టీమిండియా కొత్త కెప్టెన్ విషయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకుందట. జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య…
హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ఐపీఎల్ 2025 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన షార్ట్‌లిస్ట్ జాబితాలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఉంది. ఐపీఎల్ 2025లో మిగిలిన 16 మ్యాచ్‌ల కోసం బీసీసీఐ మూడు వేదికలను షార్ట్‌లిస్ట్ చేయగా.. లిస్ట్‌లో బెంగళూరు, చెన్నై సహా హైదరాబాద్ కూడా ఉంది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. భారత ప్రభుత్వం అనుమతి ఇస్తే.. ఈ మూడు నగరాల్లో…
భారత క్రికెట్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20లకు వీడ్కోలు పలికారు. తాజాగా రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ వన్డేకి మాత్రమే పరిమితమయ్యాడు. సరే.. కోహ్లీ ఉన్నాడులే అనుకునేలోపే అభిమానులకు హార్ట్ బ్రేక్ అయ్యే వార్త వెలుగులోకి వచ్చింది. ఎస్.. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ టూర్ కి ముందే తన టెస్ట్ రిటైర్మెంట్ ని అనౌన్స్ చేయనున్నాడు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 వాయిదాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారిక ప్రకటన చేసింది. ఐపీఎల్ 2025ను ఒక వారం పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ భాగస్వాములందరితో సమగ్ర సంప్రదింపుల అనంతరం మే 9 నుండి వారం పాటు టోర్నీని నిలిపివేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ప్రస్తుతానికి సస్పెన్షన్ ఒక వారం పాటు ఉంటుందని, తదుపరి…
Ind-Pak Tensions To Impact IPL: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తామ్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారత్ లో జరుగుతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ప్రపంచానికి తెలిసేలా చేశాడు. మీలో ప్రతిభ ఉంటే.. ఎవ్వరూ ఆపలేరని నిరూపించాడు. రాజస్థాన్ రాయల్స్‌కి చెందిన సూర్యవంశీ ఇటీవల గుజరాత్ టైటాన్స్‌పై గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా ఈ క్రీడారుడిని కాపాడుకోవాలంటూ.. క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి హెచ్చరించారు. ఛాపెల్ గతంలో టీం ఇండియా కోచ్‌గా కూడా పనిచేశారు. సూర్యవంశీ రాణించాలంటే సచిన్ టెండూల్కర్ లాంటి మద్దతు…