Bandi Sanjay Said Congress Dharna for 100 percent Muslim Reservations: ఈరోజు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తోందే తప్ప.. బీసీల కోసం కానేకాదు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌పై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. మైనారిటీ ఓట్ల కోసం ముస్లిం డిక్లరేషన్‌ను అమలు చేయాలనుకుంటోందని, బీసీలను ఘోరంగా మోసం చేస్తోందని మండిపడ్డారు.…
Telangana Govt: దేశరాజధానిలో బీసి రిజర్వేషన్ల అంశం హీటెక్కుతోంది. ఏకంగా బీసీల రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ధర్నాకు దిగుతోంది. జంతర్ మంతర్ లో జరిగే ధర్నాను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీడ్ చేయనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లును హడావిడిగా పాస్ చేసి కేంద్రానికి పంపారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆర్డినెన్స్‌తో ఏదో జరిగినట్లు కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారని విమర్శించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయ్యి నోబెల్ బహుమతి వచ్చినట్లు ఫీల్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో అగస్ట్ 5, 6, 7 తేదీల్లో డ్రామాలు ఆడబోతున్నారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని తాము డిమాండ్…
Ponnam Prabhakar : తెలంగాణలో బిసి రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో మార్చి నెలలో ఆమోదించి గవర్నర్‌కు పంపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మార్చి 22, 2025న బిల్లును గవర్నర్‌కు పంపించగా, గవర్నర్ మార్చి 30న బిల్ నంబర్ 3, బిల్ నంబర్ 4లను రాష్ట్రపతికి పంపినట్లు ఆయన వెల్లడించారు. జూలై 14న ఆర్డినెన్స్ ముసాయిదాను కూడా గవర్నర్‌కు పంపామని, గవర్నర్ నుండి సానుకూల నిర్ణయం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీలకు పంచాయతీ యాక్ట్ ప్రకారం…
BC Reservation : బీసీలకు ఉద్యోగాలు, విద్యా అవకాశాల్లో రిజర్వేషన్లను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2018లో చేసిన బీసీ రిజర్వేషన్ బిల్లులో సవరణ చేస్తూ తాజా ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. 2018లో అప్పటి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 32 శాతం నుంచి తగ్గించి 22 శాతానికి పరిమితం చేస్తూ ఆర్డినెన్స్‌ను అమలులోకి తీసుకువచ్చింది. ఈ తగ్గింపు తీరుపై అప్పట్లోనే పలువురు ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు…
Talasani Srinivas Yadav slams Congress over BC Reservation: రాష్ట్రంలో విడదీసి రాజకీయాలు చేసే కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం నడిపించింది బడుగు బలహీన వర్గాలే అని గుర్తుచేశారు. బీసీ బిడ్డలు తల్చుకుంటే భూకంపం వస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎవరు చేయమన్నారు?, ఇది సాధ్యం కాదంటే 125 ఏళ్ల అనుభవం మాకు ఉందని అన్నారని ఎద్దేవా చేశారు. బీసీ డెడికేషన్ కమీషన్ పేరుతో గోల్…
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు ఆమోదం తెలపడం ఎంతో హర్షించదగ్గ పరిణామమని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం ఓ పరిపాలన నిర్ణయం కాదు.. ఇది తెలంగాణ బీసీల విజయానికి, అలాగే తెలంగాణ జాగృతి పోరాటానికి ప్రతీక అని ఆమె స్పష్టం చేశారు. అలాగే ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగ రక్షణ బీసీలకు లేదనే ఆలోచన ఉన్న సమయంలో, ఇప్పుడు…
Telangana Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను త్వరలో జారీ చేయాలని యోచిస్తోంది. ఇదే కారణంగా రాష్ట్ర అసెంబ్లీని ప్రోరోగ్ చేసినట్లు సమాచారం. అలాగే ప్రత్యేక అసెంబ్లీ…
Minister Vakiti Srihari: మంత్రి శ్రీహరి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ అభిమతాన్ని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని చెప్పారు. పేదల ఆకలి తీర్చడం, బడుగు బలహీన వర్గాల అవసరాలను తీర్చడమే కాంగ్రెస్ అసలైన లక్ష్యమని అన్నారు. ప్రతి బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి,…
R.Krishnaiah : తెలంగాణలో బీసీల హక్కుల కోసం నడుస్తున్న ఉద్యమానికి మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చర్యలు ముమ్మరం చేశారు. బీసీ ఉద్యమ నేత, బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్యను ఆమె హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి, జూలై 17 జరగనున్న జాగృతి రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలంటూ కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “తెలంగాణ జాగృతి తరఫున మేము బీసీల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఆర్.కృష్ణయ్య గారిని కలిసాము. కాంగ్రెస్ ప్రకటించిన…