BC Reservation Case: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9 పై స్టే విధించింది రాష్ట్ర హైకోర్టు.. అయితే, హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర సర్కార్.. ఈ మేరకు సోమవారం దాదాపు 50 పేజీలకుపైగా సమగ్రమైన సమాచారంతో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పులోని అంశాలపై కూలంకషంగా చర్చించిన తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది..అయితే, 42 శాతం బీసీ రిజర్వేషన్ పై…
MLA Raja singh: బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్యం కిషన్ రెడ్డి రాజ్య అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ నినాదం చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటన అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడల్లా లేదా ప్రముఖ నాయకుడు వచ్చినప్పుడల్లా, భవిష్యత్తులో ఒక బీసీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అంటారు. తెలంగాణలో చిన్న…
StoryBoard: తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిర్ణయంతో.. దేశం మొత్తం ఇటువైపు తిరిగి చూస్తోంది. ఇప్పిటకే బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలన్న జాతీయ స్థాయి డిమాండ్ కు.. ఇక్కడ మన్నన దక్కిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పుడు మిగతా రాష్ట్రాలు, కేంద్రం కూడా బీసీల లెక్కలు తీసి.. జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లివ్వాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. మండల్ కమిషన్ నివేదిక వచ్చేదాకా బీసీలకు అసలు రిజర్వేషన్లే లేవని, ఆ తర్వాత…
Bhatti Vikramarka : బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న వేళ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైకోర్టు తీర్పుపై స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అందిన తర్వాత పూర్తి అవగాహన చేసుకుని తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “హైకోర్టు 2025 సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు జరపాలని స్పష్టంగా చెప్పింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మేము గట్టి ప్రయత్నం చేశాం. కానీ, 2018లో బీఆర్ఎస్…
KTR : తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలను ప్రదర్శించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లపాటు అడ్డగోలు విధానాలతో 42 శాతం హామీను నిర్ధారించకుండా నిలిపి, రేవంత్ రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానంలో నిలబడని జీఓ (గవర్నమెంట్ ఆర్డర్) ద్వారా బీసీలకు హామీ ఇచ్చినట్లు మభ్యపెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా వెన్నుపోటు పొడిచిన…
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు విచారణను మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో (జనరల్ ఆర్డర్) 42 శాతం బీసీ రిజర్వేషన్లను కలుపుతూ వివాదాస్పదంగా ఉంది.
బీసీ రిజర్వేషన్లను తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సుప్రీంకోర్టు అంగీకరిస్తుంది అనే నమ్మకం మాకు ఉందన్నారు.
Bhatti Vikramarka: బీఆర్ఎస్ పార్టీ తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని, కానీ రానున్న స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాలకు తెలుసునని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పెద్దలు 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆర్థిక, పాలన వ్యవస్థలను విధ్వంసం చేస్తే ప్రణాళికా ప్రకారం వాటిని సరి చేసుకుంటూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో....బీసీ రిజర్వేషన్ల అంశం మీద జోరుగా చర్చ జరుగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలన్న విషయంలో అన్ని పార్టీలది ఒకటే మాట. కానీ... సాధనలో మాత్రం ఎవరి రాజకీయాలు వారివి అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది.