MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు ఆమోదం తెలపడం ఎంతో హర్షించదగ్గ పరిణామమని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం ఓ పరిపాలన నిర్ణయం కాదు.. ఇది తెలంగాణ బీసీల విజయానికి, అలాగే తెలంగాణ జాగృతి పోరాటానికి ప్రతీక అని ఆమె స్పష్టం చేశారు. అలాగే ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగ రక్షణ బీసీలకు లేదనే ఆలోచన ఉన్న సమయంలో, ఇప్పుడు అలాంటి భావన తొలగిపోవడానికి ఆస్కారం ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్య విలువలకు ఊతమిచ్చే పని అని పేర్కొన్నారు.
Read Also:HYDRA : రెండు కాలనీల మధ్య ‘హైడ్రా’ బ్రిడ్జ్.. అడ్డుగోడ తొలగింపుతో కలిసిన కాలనీలు
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు లేకుండా అమలు పరచాల్సిన అవసరం ఉందని.. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ బీసీలకు అమలయ్యేంతవరకు ప్రభుత్వం అదే చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ నిర్ణయం వెనుక ప్రజాస్వామ్యవాదుల, బీసీ బిడ్డల హక్కుల కోసం పోరాడిన వారి మద్దతు ఉందని కవిత అభిప్రాయపడ్డారు. ఇది వారందరి విజయమేనని హర్షం వ్యక్తం చేశారు.
Read Also:Adulterated Milk Racket: చూడటానికి అచ్చం పాల లాగే ఉంటాయి.. కానీ పాలు కాదు, కాలకూట విషం!
ఈ బీసీ డీల్ తెలంగాణ రాష్ట్రంలో మనందరి పోరాటాల ఫలితంగా ఏర్పడిన బిల్లు. దేశానికే దారి చూపుతుందని.. తెలంగాణలో ప్రారంభమైన ఈ రిజర్వేషన్ ప్రక్రియ దేశమంతా 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలుకు మార్గం వేస్తుందని బలంగా విశ్వసిస్తున్నాను అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీసీలకు హక్కుల పరిరక్షణ కోసం ప్రయత్నం కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు.