Caste Census : గ్రామాలలో కుల గణన, వర్గీకరణ సంబరాలు చేయాలని పార్టీ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. నిన్న శాసనసభలో రెండు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఎన్నో ఏళ్ళు గా పెండింగ్ లో ఉన్న బిసి కులఘనన ను, ఎస్సీల వర్గీకరణ విషయంలో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి. సమాజంలో రెండు ప్రధాన వర్గాలు బిసిలు, ఎస్సీ లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కులఘనన,…
CM Revanth Reddy : తెలంగాణ శాసనసభలో కులగణన సర్వేపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న దానిపై స్పష్టమైన ప్రకటన చేస్తూ, రాజ్యాంగ పరంగా అది సాధ్యమయ్యేలా మార్పులు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే, ప్రస్తుతం రాజ్యాంగ సవరణకు అవకాశం లేకపోతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన స్థాయిలో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తుందని…
Ponnam Prabhakar: ఎవరు.. ఎంతో వారికి అంత అని రాహుల్ గాంధీ చెప్పారని, అందుకు అనుగుణంగా కుల గణన సర్వే అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడుగు.. బలహీన వర్గాలకు అండగా ఉండేది కాంగ్రెస్ ఒక్కటే అని, సర్వే లో పాల్గొనని వాళ్ళు… ఇప్పుడు కూడా నమోదు చేసుకోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. సర్వే కి వెళ్ళిన వాళ్లకు రెస్పాండ్ కాకుండా… ఇప్పుడు సర్వే రాలేదు అంటున్నారని, ప్రధాన రాజకీయ…
MLC Kavitha : కాంగ్రెస్ చేపట్టిన కులగణన కాకి లెక్కలని, ఓసీలు, ఎస్సీ ల జనాభా పెరుగుదలతో వ్యత్యాసం ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ ఆమె కరీంనగర్ నగరంలోని కోతి రాంపూర్ లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీ లకు 56.3% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. కానీ బీసీ గణన సరిగా జరగలేదు అనే మాట ప్రతి చోట వినిపించిందని, కేసీఆర్…
హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ సభ నిర్వహించారు. ముఖ్య అతిధిగా జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. 80 బీసీ సంఘాల నాయకులు కూడా సభకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు యధావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కులగణకు బీజేపీ వ్యతిరేకం కాదని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తెలిపారు. ఇవాళ ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు ఓటు వేస్తేనే నరేంద్రమోదీ మూడో సారి ప్రధాని అయ్యారన్నారు. బీసీలలో చీలిక తీసుక రావడానికి రాహుల్ గాంధీ పన్నిన కుట్ర ఇది అని, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడిన మాటలో ఏది వెనక్కి తీసుకోవాలో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పాలన్నారు ఆనంద్ గౌడ్.
Ponnam Prabhakar: బీజేపీ నేత లక్ష్మణ్ అంటే కొంత గౌరవం ఉండే కానీ తాను వచ్చిన వర్గాలకు మద్దతుగా ఉండకపోయినా కించపరిచేలా మాట్లాడటం ఏంటి..? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.