Talasani Srinivas Yadav slams Congress over BC Reservation: రాష్ట్రంలో విడదీసి రాజకీయాలు చేసే కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం నడిపించింది బడుగు బలహీన వర్గాలే అని గుర్తుచేశారు. బీసీ బిడ్డలు తల్చుకుంటే భూకంపం వస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎవరు చేయమన్నారు?, ఇది సాధ్యం కాదంటే 125 ఏళ్ల అనుభవం మాకు ఉందని అన్నారని ఎద్దేవా చేశారు. బీసీ డెడికేషన్ కమీషన్ పేరుతో గోల్ మాల్ చేస్తున్నారన్నారు. 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
‘రాష్ట్రంలో విడదీసి రాజకీయాలు చేసే కుట్రలు జరుగుతున్నాయి. అందరం బీసీ నినాదంతో ముందుకు వెళ్దాం. తెలంగాణ ఉద్యమం నడిపించింది బడుగు బలహీన వర్గాలే. బీసీ బిడ్డలు తల్చుకుంటే భూకంపం వస్తుంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎవరు చేయమన్నారు. ఇది సాధ్యం కాదంటే 125 ఏళ్ల అనుభవం మాకు ఉందని అన్నారు. 9వ షెడ్యూల్లో పెట్టి సవరణ చేస్తేనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత వస్తుందని అసెంబ్లీలో చెప్పాను. బీసీ రిజర్వేషన్ల కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామని సీఎం చెప్పారు. ఇప్పటికి అతిగతి లేదు. వంద రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం చెప్పడంతో హరిబరిగా జీవోలు ఇస్తున్నారు. ఆర్డినెన్స్ పేరుతో కొత్త డ్రామాకు తెర లేపారు. ఆర్డినెన్స్ చెల్లదని తెలిసి మంత్రులు, బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దలను ఒప్పించాలని చెబుతున్నారు’ అని తలసాని అన్నారు.
Also Read: ENG vs IND: ‘ఒక్క ఛాన్స్’ ప్లేయర్ ఔట్.. నాలుగో టెస్ట్ భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
‘బీసీ డెడికేషన్ కమీషన్ పేరుతో గోల్ మాల్ చేస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. మేము బిచ్చగాళ్లము కాదు.. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే సహకరిస్తాం. మేమేంతో మాకు అంత ఇవ్వాలి. త్వరలోనే తెలంగాణలో బీసీ ఉద్యమం రాబోతుంది. ఒకప్పుడు బాంచన్ కాళ్లు మొక్కుతాం అని బీసీలు అనేవాళ్లు.. ఇప్పుడు బీసీలు అలా లేరు. మా గౌరవంకు భంగం కలిగితే చూస్తూ ఊరుకోం. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోయితే మీ అధికారాన్ని మేము తీసుకుంటాం’ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.