యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ఉన్నపళంగా సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి కనిపించకుండా పోయిన బయ్యా సన్నీ.. నెల రోజుల తర్వాత సింహాచలంలో కనిపించాడు. సింహాచలంలో ఫొటోస్ దిగి.. ‘నేను వచ్చేశా’ అంటూ మరో యూట్యూబర్ అన్వేష్ టార్గెట్‌గా పోస్ట్‌లు పెట్టాడు. ‘వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికెళ్తా, మీ అమ్మానాన్నకి ధైర్యం చెబుతా. నువ్వు టెన్షన్ పడకు’ అంటూ మంగళవారం పోస్ట్ చేశాడు. ప్రస్తుతం బయ్యా సన్నీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బయ్యా…
యూట్యూబ్ భయ్యా సన్నీ యాదవ్ ను ఎన్ఐఏ అధికారులు చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే సన్నీ యాదవ్ బైక్‌పై పాకిస్థాన్ వెళ్లి వచ్చాడు. దీంతో పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్నీ యాదవ్ తండ్రి రవీందర్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. భయ్యా సన్నీ యాదవ్ ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సన్నీ యాదవ్ స్నేహితుడు చెర్రీని ఇంట్లో 29న గుర్తుతెలియని వ్యక్తులు అదుపులోకి…
యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే సన్నీ యాదవ్ బైక్‌పై పాకిస్థాన్ వెళ్లి వచ్చాడు.
తెలుగు మోటోవ్లాగర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరొందిన బయ్యా సన్నీ యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ఆరోపణలపై నమోదైన కేసులో అతను ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది, అయితే తదుపరి విచారణను మార్చి 24, 2025కి వాయిదా వేసింది. సన్నీ యాదవ్‌పై మార్చి 5, 2025న నూతనకల్ పోలీస్…
Betting Apps : ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ సూచన మేరకు సూర్యాపేట జిల్లా పోలీసులు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు చేశారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కారణంగా నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. అయితే, సన్నీ యాదవ్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో, పోలీసులు అతని ఇంటికి నోటీసులు అంటించారు. నోటీసులు ఇచ్చిన రెండు వారాలు గడుస్తున్నప్పటికీ, అతని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, పోలీసులు కీలక…