యూట్యూబ్ భయ్యా సన్నీ యాదవ్ ను ఎన్ఐఏ అధికారులు చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే సన్నీ యాదవ్ బైక్‌పై పాకిస్థాన్ వెళ్లి వచ్చాడు. దీంతో పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సన్నీ యాదవ్ తండ్రి రవీందర్ ఎన్టీవీతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. భయ్యా సన్నీ యాదవ్ ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సన్నీ యాదవ్ స్నేహితుడు చెర్రీని ఇంట్లో 29న గుర్తుతెలియని వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు మా ఇంటికి కూడా వచ్చారన్నారు.
Also Read:PM Modi: పాకిస్తాన్ వైమానిక స్థావరాలను నిమిషాల్లో నాశనం చేశాం..
కొన్ని పత్రాలు పరిశీలించారని మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. మా అబ్బాయికి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవు. సన్నీ యాదవ్ దేశ భక్తుడు.. పాకిస్తాన్ కు కేవలం బైక్ రైడర్ గానే వెళ్ళాడు.. పహల్గాం ఘటనకు ముందే పాకిస్తాన్ టూర్ కంప్లీట్ చేసుకుని వచ్చాడని తెలిపాడు. ఎవరు, ఎందుకు అదుపులోకి తీసుకున్నారో చెప్తే.. నేను కూడా వారికి సహాకరిస్తానని తెలిపాడు. మా అబ్బాయి ఆచూకీ చెప్పాలి. లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపాడు.