ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మెకు దిగనున్నారు. వారానికి ఐదురోజులే పనిదినాలు ఉండాలని, తమకు పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్లను పరిష్కరించాలంటూ ఈనెల 27న సమ్మె చేయనున్నట్లు 9 బ్యాంకుల యూనియన్‌ల సంస్థ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటన చేసింది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను ఎత్తివేసి పాత పెన్షన్ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం డిమాండ్ చేశారు. పెన్షనర్లందరి పెన్షన్ల అప్‌డేషన్, రివిజన్ తమ…
ఉమ్మడి గుంటూరు జిల్లాలో బ్యాంక్ ఉద్యోగులు చేతి వాటం ఖాతాదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.. కంచె చేను మేసిన చందంగా బ్యాంక్ ఉద్యోగులు బ్యాంకుల్నే మోసం చేస్తున్నారు. నిన్న రాజుపాలెం మండలం నేడు తెనాలి జీడీసీసీ బ్యాంక్ లలో వరుస గోల్డ్ స్కాం లు బ్యాంక్ ల లో సిబ్బంది నిర్వాకాన్ని బయటపెట్టింది. పల్నాడు ప్రాంతం రాజుపాలెంలో సెంట్రల్ బ్యాంక్ లో గిల్ట్ బంగారం వ్యవహారం బయట పడింది. ఈ వ్యవహారం బయటకు వచ్చిన…
ఈ మధ్యే వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు.. దీంతో రెపో రేటు 4.40 శాతానికి చేరింది. ఇక, ఆర్బీఐ చర్యను ఊహించిన కొన్ని బ్యాంకులు ముందుగానే తమ ఎంసీఎల్ఆర్ రుణ వడ్డీరేట్లు పెంచేశాయి. రెపోరేట్…
క్రెడిట్ కార్డుల జారీని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరింత కట్టుదిట్టం చేసింది. కస్టమర్ల సమ్మతి తీసుకోకుండా క్రెడిట్ కార్డులు ఇవ్వడం లేదా ప్రస్తుత కార్డును అప్‌గ్రేడ్ చేయడం వంటివి చేయొద్దని అన్ని బ్యాంకులు, కంపెనీలను ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ విషయాన్ని ఉల్లంఘిస్తే కస్టమర్ నుంచి వసూలు చేసిన బిల్లుకు రెట్టింపు మొత్తాన్ని జరిమానా విధిస్తామని ఆర్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా క్రెడిట్ కార్డులకు సంబంధించి రుణాల వసూలు కోసం సంస్థలు కస్టమర్లపై వేధింపులు, బెదిరింపులకు దిగరాదని…
ఈరోజుల్లో ప్రతి చిన్న అవసరానికి అప్పులు చేయాల్సి వస్తోంది. కోవిడ్ కారణంగా ఉద్యోగాలు సరిగా లేకపోవడం వల్ల అప్పులు తీసుకుంటున్నారు. గతంలో బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు లోన్ యాప్ ల పేరుతో అప్పులిచ్చే సంస్థలు పుట్టుకువచ్చాయి. లోన్ యాప్ ల ద్వారా అప్పులు తీసుకునేవారు అప్రమత్తంగా వుండాలని సూచించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్. లోన్ యాప్స్ ముఠాలు మళ్ళీ రెచ్చిపోతున్నారని, పోలీస్ దాడులతో..కొద్దిరోజులు లోన్స్ ఇవ్వటం ఆపేశారన్నారు. అధిక లాభాలు…
కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రైవేటీకరణ, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కేంద్ర ఉద్యోగ, కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు మేరకు రెండు రోజుల “భారత్ బంద్ కొనసాగుతోంది. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక అనేక డిమాండ్లు తెరమీదకు తెచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయడం. అసంఘటిత రంగాల్లోని కార్మికుల కోసం సామాజిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం కోరుతోంది. అంతేకాకుండా కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల తగ్గింపు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు పటిష్ట చర్యలు.…
ఏపీలో సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్రంలో జిల్లా, కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పని తీరును సమీక్షించారు. కంప్యూటరైజేషన్, పారదర్శక విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై కీలక చర్చ జరిగింది. సహకార బ్యాంకులు మన బ్యాంకులు, వాటిని మనం కాపాడుకోవాలి. తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయి, దీనివల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంది. వెసులుబాటు ఉన్నంత…
సీబీఐ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు మోసాన్ని చూసింది నోరు వెల్లబెడతున్నారు అధికారులు.. ఇప్పటికే వందల, వేల కోట్లు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి.. విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్తలు ఎందరో ఉండగా… దేశంలో మరో భారీ మోసం బయటపడిందది. నౌకల తయారీ రంగానికి చెందిన ఏబీజీ షిప్‌యార్డ్ దేశంలోని పలు బ్యాంకులను రూ.22,842 కోట్లకు మోసం చేసినట్టు బయటపడింది.. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. సంబంధిత కంపెనీ డైరెక్టర్లపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.. ఏబీజీ షిప్‌యార్డ్.. మొత్తం…
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి సమీక్షా సమావేశానికి సిద్ధం అవుతోంది.. రేపటి నుంచి 10వ తేదీ వరకు ఈ కీలక సమావేశం జరగబోతోంది.. అయితే, ఇదే సమయంలో.. వడ్డీ రేట్లపై చర్చ మొదలైంది.. కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచే అవకాశం ఉందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్ అంచనా వేస్తోంది.. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరణ నేపథ్యంలో వృద్ధిపై ఆందోళనలు వ్యక్తమవుతుండగా.. ద్రవ్యోల్బణం ఆర్బీఐ…