ఈరోజుల్లో ప్రతి చిన్న అవసరానికి అప్పులు చేయాల్సి వస్తోంది. కోవిడ్ కారణంగా ఉద్యోగాలు సరిగా లేకపోవడం వల్ల అప్పులు తీసుకుంటున్నారు. గతంలో బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు లోన్ యాప్ ల పేరుతో అప్పులిచ్చే సంస్థలు పుట్టుకువచ్చాయి. లోన్ యాప్ ల ద్వారా అప్పులు తీసుకునేవారు అప్రమత్తంగా వుండాలని సూచించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్.
లోన్ యాప్స్ ముఠాలు మళ్ళీ రెచ్చిపోతున్నారని, పోలీస్ దాడులతో..కొద్దిరోజులు లోన్స్ ఇవ్వటం ఆపేశారన్నారు. అధిక లాభాలు వస్తుండటంతో ఈ వ్యాపారాన్ని వదులుకోవట్లేదు. బెంగళూర్, ఢిల్లీ నుండి లోన్ యాప్స్ కాల్ సెంటర్ లు వున్నట్టు గుర్తించామన్నారు ఏసీపీ ప్రసాద్. లోన్ యాప్ బాధితులు ఎవరూ అధైర్య పడి,ఆత్మహత్యలు చేసుకోవద్ధు. తగిన ఆధారాలతో సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తే ..ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తామన్నారు.
ఎఫ్ ఐ ఆర్ ను ఆన్లైన్ లో పెడితే వాళ్ల వ్యాపారానికి నష్టం వస్తుంది..కాబట్టి ఎవరినీ వేధించరు. అడగకుండానే లోన్ లు ఇస్తున్న వారి పట్ల జాగ్రత్తగా వుండాలన్నారు ఎన్టీవీతో సైబర్ క్రైం ఏసీపీ ప్రసాద్. అప్పుల విషయంలో జాగ్రత్తగా వుండాలని, గుర్తింపు పొందిన సంస్థలలో మాత్రమే అప్పులు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. గతంలో లోన్ యాప్ ల బారిన పడి అధిక వడ్డీలు కట్టలేక, బ్లాక్ మెయిలింగ్ తట్టుకోలేక అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.
Read Also: Indian Police Force: వెబ్ సీరిస్ పై దృష్టి పెట్టిన రోహిత్ శెట్టి!