బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాల్సి ఉండటంతో ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బంగ్లాదేశ్‌లోని మదారిపూర్‌లోని శిబ్‌చార్ ఉపజిల్లాలోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో బస్సు కాలువలో పడిపోవడంతో 16 మంది మరణించగా.. 30 మంది గాయపడ్డారు.
బంగ్లాదేశ్‌లో భారీ పేలుడు సంభవించింది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో గల గులిస్థాన్ ప్రాంతంలో బహుళ అంతస్థుల భవనంలో జరిగిన పేలుడులో కనీసం 14 మంది మరణించారు. దాదాపు 100 మంది గాయపడ్డారు.
Oxygen Plant Blast : బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిట్టగాంగ్‌లోని సీతకుంట ఉపజిల్లాలోని ఆక్సిజన్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
అవామీ లీగ్ నాయకుడు మహ్మద్ షహబుద్దీన్ చుప్పు బంగ్లాదేశ్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మెజారిటీ ఉన్న ఆయనను అధికార పార్టీ నామినేట్ చేయడంతో.. ఈ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వారు ఎవరూ లేకపోవడంతో, చుప్పు అప్రమేయంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
చికిత్స కోసం భారత్‌కు వచ్చిన కువైట్‌కు చెందిన మహిళ(31) గత నెలలో కోల్‌కతా నుంచి తప్పిపోయింది. ఈ వారం పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో సదరు మహిళ ఉన్నట్లు ఆచూకీ లభ్యమైంది ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
MV Ganga Vilas: ప్రపంచంలోనే అతి పొడవైన నదీ యాత్రను ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీనికి వారణాసి వేదిక కానుంది. ఎంవీ గంగా విలాస్ అనే నౌకను వీడియో లింక్ ద్వారా ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గా గుర్తింపు పొందింది. షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర మంత్రులు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నాయకుడి కుటుంబాన్ని కలవడానికి అమెరికా రాయబారి షాహీన్‌బాగ్‌ను సందర్శించడం బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునే ప్రయత్నమని రష్యా పేర్కొంది. బంగ్లాదేశ్‌లోని రష్యా రాయబార కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.