బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఝలకతి సదర్ ఉపజిల్లాలోని ఛత్రకాండ ప్రాంతంలో శనివారం బస్సు రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా.. 35 మందికి పైగా గాయపడ్డారు.
బంగ్లాదేశ్ తరఫున మహిళల వన్డే క్రికెట్లో తొలి సెంచరీ నమోదైంది. ఇండియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (జులై 22) జరుగుతున్న మూడో వన్డేలో ఫర్జానా హాక్ సెంచరీ చేసింది.
Hindu Temples: పాకిస్థాన్ తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయంలో విధ్వంసం ఘటన తెరపైకి వచ్చింది. బ్రాహ్మణబారియా జిల్లాలో 36 ఏళ్ల వ్యక్తి హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు.
కృష్ణ మండల్ అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారంటూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తన దగ్గర ఎలాంటి పాస్‌పోర్ట్ లేదని ఆమె పోలీసులకు చెప్పింది. అందుకే తాను ప్రమాదకమైన దారిలో ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నానని చెప్పింది. అయినప్పటికీ సురేంద్రపూర్ పోలీసులు అమెను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆమెకు మూడు నెలల జైలు శిక్ష వేసింది. అయితే, శిక్ష పూర్తయిన తర్వాత అధికారులు ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించి వేశారు.
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టు.. 4 రోజుల్లో వరుసగా రెండోసారి ఓడిపోయింది. బంగ్లాదేశ్ సిరీస్‌లో భాగంగా చివరి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీమిండియాను ఓడించింది. ఆదివారం జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.
స్వదేశంలో అఫ్ఘనిస్తాన్ చేతిలో వైట్‌వాష్ అయ్యే ప్రమాదాన్ని బంగ్లాదేశ్ జట్టు తప్పించుకుంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో బంగ్లా టీమ్ 0-2తో వెనుకపడగా.. ఇవాళ (మంగళవారం) జరిగినమూడో వన్డేలో గెలవడంతో ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించి, దీంతో ఘోర పరాభవం ఎదుర్కోకుండా బయట పడింది. దీంతో వన్డే సిరీస్ ను ఆఫ్ఘినస్తాన్ టీమ్ సొంతం చేసుకుంది.
వీరి ధాటికి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి జస్ట్ 95 పరుగలు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా ఖాతూన్ 3 వికెట్లు తీయగా.. ఫాతిమా ఖాతూన్ 2, మరూఫా అక్తెర్, నమిద అక్తెర్, రబెయా ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు. భారత మహిళ బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. ఓపెనర్ షఫాలీ వర్మ చేసిన 19 పరుగులే టీమిండియా ఇన్సింగ్స్ లో టాప్ స్కోర్‌గా నిలిచింది.
నాలుగు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు అనుకున్నట్టుగానే విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో టీమిండియా మహిళల జట్టు విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టి20లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఆఫ్ఘనిస్థాన్ జట్టు స్పిన్ బౌలింగ్‌కు చాలా ఫేమస్ అని క్రికెట్ ఫ్యాన్స్ కు తెలిసిన విషయమే. ఈ జట్టులో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వంటి బౌలర్లు.. ఎలాంటి బ్యాట్స్‌మెన్‌నైనా ఇబ్బంది పెట్టగలరు. అయితే శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్థాన్ బ్యాట్స్మెన్లు తమ సత్తా చాటుతూ భారీ స్కోరు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ నిన్న (గురువారం) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి అందరికి షాక్ కు గురి చేశాడు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్లు అతడు పేర్కొన్నాడు. కాగా అతను రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడం వెనుక బంగ్లా ప్రధాని షేక్ హసీనా జోక్యం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్ ఇవాళ బంగ్లా ప్రధాని షేక్ హసీనాను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఈ నేపథ్యంలో…