RSS Leader: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేత సునీల్ అంబేకర్ విజ్ఞప్తి చేశారు.
బంగ్లాదేశ్లో హిందువులపై హింసాత్మక ఘటనలు నిరంతరం పెరుగుతున్నాయి. యూనస్ ప్రభుత్వ వాదనలు ఉన్నప్పటికీ, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సుమన్గంజ్ జిల్లాలో హిందువుల ఇళ్లపై ఛాందసవాదుల గుంపు దాడి చేసింది. ఈ బుధవారం హిందువుల ఇళ్లపై గుంపు దాడులు చేసింది.
Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ అల్లర్లపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అయోధ్య, ఇప్పుడు సంభాల్, బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ.. ప్రజల మధ్య చిచ్చుపెట్టి, సామాజిక విభజనకు పాల్పడే వారు అన్ని చోట్లా ఉన్నారు.
బంగ్లాదేశ్లో హిందువులపై హింసాత్మక ఘటనలు నిరంతరం పెరుగుతున్నాయి. యూనస్ ప్రభుత్వ వాదనలు ఉన్నప్పటికీ, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సుమన్గంజ్ జిల్లాలో హిందువుల ఇళ్లపై ఛాందసవాదుల గుంపు దాడి చేసింది.
Bangladesh: బంగ్లాదేశ్లో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని యూకే హెచ్చరించింది. తమ పౌరులు ఆ దేశానికి ప్రయాణించకుండా హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం యూకే ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ‘‘రద్దీగా ఉండే ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలు వంటి వాటిలో పాటు విదేశీ పౌరులు సందర్శించే ప్రదేశాలతో సహా తీవ్రవాద దాడులు విచక్షణారహితంగా జరగవచ్చు’’ అని యూకే తెలిపింది.
Bangladesh: బంగ్లాదేశ్లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. అక్కడి మైనారిటీలకు న్యాయం కూడా దొరకడం లేదు. బంగ్లాదేశ్లో ప్రముఖ హిందూ సన్యాసి, హిందువుల హక్కుల కోసం పోరాడుతున్న చిన్మోయ్ కృష్ణదాస్ని అక్కడి అధికారులు దేశద్రోహం కేసుపై అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, అతడి తరుపున వాదించేందుకు ఏ లాయర్ కూడా ముందుకు రావడం లేదు.
Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై అఘాయిత్యాలు పెరిగాయి. హిందూ నేతల అరెస్టులు, హిందువుల ఆలయాలు, ఆస్తులు, వ్యాపారాలు, ఇళ్లపై మతోన్మాద మూక దాడులకు తెగబడుతోంది. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ అక్కడి అరాచకాలను కంట్రోల్ చేయలేకపోతున్నాడు.
Mamata Banerjee: బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువుల అణిచివేత జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రముఖ హిందూ నేతల్ని అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తోంది. రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్ల కారణంగా షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆ దేశవ్యాప్తంగా మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. గుడులు, హిందూ వ్యాపారాలు, ఇళ్లపై దాడులు చేస్తూనే ఉన్నారు.
Bangladesh: బంగ్లాదేశ్లో హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న అణిచివేతను పట్టించుకోవడం లేదు.
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి, భారత్లోని మైనారిటీల పరిస్థితి ఒకేలా ఉందని, రెండు దేశాల మధ్య భేదం లేదని ఆమె అన్నారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ ముఫ్తీ ప్రకటనను పలువురు బీజేపీ నేతలు ఖండించారు. ఆమె వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమని చెప్పారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని కోరారు.