Bangladesh News : బంగ్లాదేశ్‌లో జైలు పై దాడి.. 500 మందికి పైగా ఖైదీలు పరార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh News : ప్రస్తుతం పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో గందరగోళం నెలకొని ఉంది. రెండు నెలలుగా విద్యార్థులు రిజర్వేషన్ల కోసం వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఆ తర్వాత సోమవారం (ఆగస్టు 5) బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఆందోళనల కారణంగా ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. గత 15 ఏళ్లుగా ఆమె ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టిస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా రాజీనామా తర్వాత, ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. అయితే, విద్యార్థులు సైనిక ప్రభుత్వానికి మద్దతు ఇవ్వలేదు.
Read Also:CM Revanth Reddy: ఆయన పాట ప్రజా యుద్ధ నౌక.. గద్దర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నసీఎం..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తరువాత, దేశ పరిస్థితి, వ్యవస్థ పతనమైంది. ఆ తర్వాత దేశంలోని జైళ్లు కూడా ఖాళీ అవుతున్నాయి. పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి దేశంలో కర్ఫ్యూ విధించింది. అయితే సోమవారం ప్రజలు కర్ఫ్యూను ఉల్లంఘించి వీధుల్లోకి వచ్చారు. కర్ఫ్యూ సమయంలో అగంతకులు పగటిపూట కర్రలతో జైలులోకి ప్రవేశించారు. ఉత్తర బంగ్లాదేశ్‌లోని షేర్పూర్ జిల్లాలోని జైలు నుంచి దాదాపు 500 మంది ఖైదీలు దుండగుల సాయంతో పరారయ్యారు.
Read Also:INDIA Alliance: పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఆందోళన.. ఎందుకో తెలుసా..?
పోలీస్ స్టేషన్‌కు నిప్పు
షేర్పూర్ మాత్రమే కాదు, దామ్‌దామా కాలిగంజ్ ప్రాంతంలోని జైలులోకి కూడా ప్రజలు ప్రవేశించి జైలుకు నిప్పు పెట్టారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య జైలుపై దాడి జరిగిందని షేర్పూర్ డిప్యూటీ కమిషనర్ అబ్దుల్లా అల్ ఖైరున్ తెలిపారు. అలాంటి విధ్వంసకర దృశ్యం సోమవారం బంగ్లాదేశ్‌లో కనిపించింది. ఆగ్రహించిన గుంపు జైలునే కాకుండా పోలీసు స్టేషన్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంది. సుమారు 1 గంట సమయంలో సదర్ పోలీస్ స్టేషన్‌కు ప్రజలు నిప్పు పెట్టారు. ఆ గుంపు జిల్లా పరిషత్, జిల్లా ఎన్నికల కార్యాలయం, సోనాలి బ్యాంక్, అనేక దుకాణాలను కూడా ధ్వంసం చేసింది. షేక్ హసీనా, భారతదేశం మధ్య సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. ఆమె బంగ్లాదేశ్ నుండి పొరుగు దేశం భారతదేశానికి నేరుగా బయలుదేరింది. ఇక్కడి నుంచి ఇంగ్లండ్ వెళ్లవచ్చని భావిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆమె ఇండియాలో ఉన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..