Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో మత ఛాందసవాదం మరింత పెరిగింది. బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత అయిన మహ్మద్ యూనస్ కూడా రాడికల్ ఇస్లామిక్ సంస్థలైన ‘‘జమాతే ఇస్లామీ’, ‘‘హిజ్‌బుత్ తెహ్రీర్’’ వంటి సంస్థలపై మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాడు. దీంతో ఈ గ్రూపులు దేశవ్యాప్తంగా రెచ్చిపోతున్నాయి. మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి.
Bangladesh: బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ సర్కార్ నెమ్మదిగా ఆ దేశ చరిత్రను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన, ఆ దేశ జాతిపితగా కీర్తించబడే షేక్ ముజిబుర్ రెహ్మన్‌కి సంబంధించిన చరిత్రను పాఠశాల పుస్తకాల నుంచి తొలగించేందుకు సిద్ధమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి అయిన ముజిబుర్ రెహ్మాన్ పాత్రను స్వాతంత్య్ర పోరాటం నుంచి తగ్గిస్తోంది. దీనికి తోడు 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి కారణమైన, బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ సహకారాన్ని కూడా…
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పార్టీతో పాటు సంకీర్ణ సర్కార్ లోని పార్టీలను కష్టాలు వెంటాడుతున్నాయి. ఢాకాలోని హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడి చేశారు.
Bangladesh: రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా హింసాత్మక నిరసనలు జరిగాయి. ఆ తర్వాత పరిణామాల్లో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చారు. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కిలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయారో, అప్పటి నుంచి ఆ దేశంలో రాడికల్ ఇస్లామిక్ సంస్థలు యాక్టివ్ అయ్యాయి. యూనస్ ప్రభుత్వం పలువురు ర్యాడికల్ ఇస్లామిక్ నేతల్ని విడుదల చేసింది.
బంగ్లాదేశ్లో కొనసాగుతున్న నిరసనలు షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని తొలగించడానికి దారితీసింది. బంగ్లాదేశ్‌లో నిరసనలకు విద్యార్థులే నాయకత్వం వహించినట్లు కనిపించినప్పటికీ.. ముఖ్యంగా మైనారిటీ హిందువులపై హింస ఉగ్రవాద సంస్థలచే నిర్వహించబడిందని నిఘా నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగా.. ఉగ్రవాద సంస్థల నుండి భారతదేశానికి ముప్పు పెరుగుతోందని నిఘా వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), బంగ్లాదేశ్‌కు చెందిన అన్సరుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ)తో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లు సమాచారం.
Bangladesh : బంగ్లాదేశ్లో హింసాత్మక సంఘటనలు.. షేక్ హసీనాను గద్దెదించిన తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
Bangladesh Crisis : రిజర్వేషన్ల విషయంలో ఇటీవల బంగ్లాదేశ్‌లో మొదలైన హింస ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో 232 మంది చనిపోయారు.
బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ మినహా ఇండియా కూటమిలోని పార్టీలను కేంద్రం ఆహ్వానించింది.
కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంట. షేక్ హసీనా విషయంలో ఇది అక్షరాల నిజమైంది. షేక్ హసీనాకు నమ్మకంగా ఉంటూనే ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ (58) వెన్నుపోటు పొడిచినట్లుగా తెలుస్తోంది.
పెద్దోళ్లతో కయ్యాలు పెట్టుకోవద్దని అప్పుడప్పుడు పెద్దలు చెబుతుంటారు. ఇది మనుషుల మధ్య జరిగే సంభాషణే అయినా.. ఇది మాత్రం ఒక దేశం విషయంలో అక్షరాలు నిజమైనట్లుగా సమాచారం.