Sheikh Hasina: బంగ్లాదేశ్లో షేక్ హసీనా పార్టీ కార్యాలయానికి నిప్పు..
- బంగ్లాదేశ్ మాజీ ప్రధానిని వెంటాడుతున్న కష్టాలు..
- ఢాకాలోని షేక్ హసీనా పార్టీ ఆఫీసుపై దాడి చేసిన దుండగులు..
- అవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయానికి నిప్పు పెట్టిన అల్లరి మూకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా పార్టీతో పాటు సంకీర్ణ సర్కార్ లోని పార్టీలను కష్టాలు వెంటాడుతున్నాయి. ఢాకాలోని హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడి చేశారు. ఆఫీసును ధ్వంసం చేసి, ఆపై నిప్పు పెట్టారు. బంగ్లాదేశ్‌ను 15 సంవత్సరాలు పరిపాలించిన షేక్ హసీనా గత ఆగస్టులో విద్యార్థి ఉద్యమంతో తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆమె ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్నారు.
Read Also: Road Accident: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. 12 మందికి గాయాలు!
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
కాగా, బంగ్లాదేశ్‌కు 1971లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్ విధానం కొనసాగుతుంది. స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు 30 శాతం, దేశంలోని వెనుకబడిన జిల్లాల యువతకు 10 శాతం, మహిళలకు 10 శాతం, మైనార్టీలకు 5 శాతం, వికలాంగులకు ఒకశాతం రిజర్వేషన్లు అందిస్తున్నారు. మొత్తంగా బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 56 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. 2018లో బంగ్లాలోని యువత ఈ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కొన్ని నెలల పాటు కొనసాగిన నిరసన ఆ తర్వాత.. బంగ్లాదేశ్ సర్కార్ రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: Diwali Celebrations: టపాసులు పేలుస్తూ ఆవులను పరుగెత్తించారు.. ఇదో ఆచారమట మరి!
ఇక, 2024 జూన్ 5న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు పాత రిజర్వేషన్ విధానాన్ని మళ్లీ దేశంలో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. షేక్ హసీనా సర్కార్ కూడా సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేయగా.. ఆ ఉత్తర్వును ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు బంగ్లాదేశ్‌లోని యూనివర్సిటీల నుంచి మొదలైన ఈ నిరసన ఆ తర్వాత హింసాత్మకంగా మారిపోయింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం యత్నించినప్పటికి అది ఫలించకపోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన భారత్ పరార్ అయింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!