Bangladesh Crisis : రిజర్వేషన్ల విషయంలో ఇటీవల బంగ్లాదేశ్‌లో మొదలైన హింస ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో 232 మంది చనిపోయారు. జూలై మధ్యలో ప్రారంభమైన రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల్లో మరణించిన వారి సంఖ్య 560కి చేరుకుంది. బంగ్లాదేశ్‌లోని ప్రోథోమ్ అలో వార్తాపత్రిక ప్రకారం.. బుధవారం ఒక్కరోజే హింసలో 21 మంది మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొందరు చనిపోయారు.
బంగ్లాదేశ్‌లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం రిజర్వేషన్లు కేటాయించింది ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు జూన్ నెల నుండి ఆందోళన చేస్తున్నారు. అనేక వారాల పాటు కొనసాగిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల మధ్య ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 5న రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. ప్రభుత్వ పతనం తరువాత, నిరసనలు హింసాత్మకంగా మారాయి, ఇందులో 232 మంది మరణించారు.
Read Also:Bangladesh: 26ఏళ్ల ఇద్దరు విద్యార్థి నాయకులు..షేక్ హసీనా ప్రభుత్వాన్ని మట్టికరిపించారు
23 రోజుల్లో 560 మంది మృతి
షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత జరిగిన నిరసనల్లో 232 మంది ప్రాణాలు కోల్పోయారు. జూలై 16 – ఆగస్టు 4 మధ్య రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన ఘర్షణలలో 328 మంది మరణించారు. ఈ రెండు పరిణామాల మధ్య గత 23 రోజుల్లో మొత్తం 560 మరణాలు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది మంగళవారం మరణించారు.
209 మంది ఖైదీలు జైలు నుంచి పరార్
మంగళవారం ఘాజీపూర్‌లోని కాశీపూర్ హై సెక్యూరిటీ జైలు నుంచి దాదాపు 209 మంది ఖైదీలు పరారయ్యారు. ఖైదీలు పారిపోకుండా జైలు భద్రతా సిబ్బంది కూడా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు సహా ఆరుగురు మరణించినట్లు జైలు వర్గాలు తెలిపాయి.
Read Also:KTR: యాభై ఏళ్లు నీటి ఇబ్బంది రాకుండా సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశాం..
విధులకు వెళ్లకుండా తప్పించుకుంటున్న పోలీసులు
షేక్ హసీనా దేశం విడిచి వెళ్లినప్పటి నుండి భద్రతా సిబ్బందిపై దాడులు కొనసాగుతున్నాయి. దీంతో భయపడి పోలీసులు విధులకు దూరంగా ఉంటున్నారు. గత మూడు రోజులుగా రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు లేరు. రాజధాని రోడ్లపై విద్యార్థులు, ఇతర స్వచ్ఛంద సంస్థల కార్మికులు ట్రాఫిక్ పోలీసులుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా, బుధవారం కొత్తగా నియమితులైన ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహ్మద్ మైనుల్ ఇస్లాం 24 గంటల్లోగా తమ తమ కార్యాలయాలకు తిరిగి రావాలని పోలీసులను ఆదేశించారు.