షేక్ హసీనా.. సుదీర్ఘ కాలం పాటు బంగ్లాదేశ్‌ను పరిపాలించిన మహా నేత. ఎంతో ఘనకీర్తిని సంపాదించింది. కానీ ఒక్క రోజులోనే చరిత్ర తల్లకిందులైంది. ప్రధాని పదవికి గుడ్‌బై చెప్పి విదేశాలకు పారిపోయింది.
Sheikh Hasina : బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం తిరుగుబాటు స్థాయికి చేరుకుంది. సోమవారం (ఆగస్టు 5) ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి 45 నిమిషాల్లో దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది.
Pak ISI And China Forced Out Sheikh Hasina: రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం షేక్ హసీనాకు వ్యతిరేకంగా కొనసాగింది. హసీనా ప్రభుత్వాన్ని తొలగించి తమకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వాన్ని తీసుకురావాలని పాకిస్థాన్, చైనాలు చాలా కాలంగా కోరుకున్నాయి.
Rahul Gandhi: షేక్ హసీనాను గద్దె దింపేందుకు గత కొన్ని వారాలుగా బంగ్లాలో జరిగిన నాటకీయ పరిణామాల వెనుక విదేశీ శక్తుల కుట్ర.. ప్రత్యేకించి పాకిస్థాన్ ప్రమేయం ఏమైనా ఉందా..? అని రాహుల్ ప్రశ్నించాగా.. దీనిపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందర పాటు అవుతుందని జై శంకర్ బదులిచ్చారు.
Bangladesh Protest : బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని తొలగించిన తర్వాత భారత భద్రతా సంస్థలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో ఉన్న భారత సరిహద్దులను పూర్తి నిఘాతో పర్యవేక్షిస్తున్నారు.
Bangladesh clashes: బంగ్లాదేశ్ భగ్గుమంటోంది. మరోసారి నిరసనలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఆదివారం రాజధాని ఢాకాలో నిరసనకారులు చేపట్టిన కార్యక్రమాలు హింసకు కారణమయ్యాయి. నిరసనకారులు పోలీసులు, అధికార అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల్లో 93 మందికి పైగా మరణించారు.
Bangladesh clashes: బంగ్లాదేశ్ వ్యాప్తంగా మరోసారి ఘర్షణలు చెలరేగాయి. ఇటీవల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు, ప్రజలు ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 200 మందికి పైగా మృతి చెందారు. ఇదిలా ఉంటే పోలీసులు అణిచివేతకు వ్యతిరేకంగా మరోసారి ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకారులు రోడ్డెక్కారు. రాజధాని ఢాకాలో నిరసనకారులు, విద్యార్థులు పోలీసులకు, అధికార అవామీ లీగ్ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరిగాయి.…
Bangladesh Protest: రిజర్వేషన్లపై బంగ్లాదేశ్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 50 మంది మరణించినట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో నిరసనకారులు గవర్నమెంట్, ప్రైవేట్ ఆస్తులకు నిప్పుపెట్టి, ధ్వంసం చేస్తున్నారు.