Home
Bangladesh Politics
Bangladesh Politics News
-
Sheikh Hasina Return: హామీ ఇస్తేనే హసీనాను పంపిస్తాం.. బంగ్లాదేశ్‌కు భారత్ షరతులు!
Sheikh Hasina Return: 2024 ఆగస్టు హింసాత్మక ఉద్యమం తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచిపెట్టి భారత్ వచ్చారు. అప్పటి నుంచి హసీనా ఇక్కడే ఉంటున్నారు. మరోవైపు, మానవత్వానికి వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బంగ్లాదేశ్ కోర్టులు ఆమెకు మరణశిక్ష విధించాయి. ఇలాంటి పరిణామాలు ఉన్నప్పటికీ.. షేక్ హసీనా డిసెంబర్లో స్వదేశానికి వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో వచ్చే నెల బంగ్లాలో ఏం జరుగుతుందా? అనే టెన్షన్ సర్వత్రా ఉంది. ఇదిలా ఉంటే, షేక్… -
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
Muhammad Yunus: న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో బంగ్లాదేశ్ మాజీ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌కు తీవ్ర నిరసన ఎదురైంది. "మీరు ఉగ్రవాది, వేలాది మందిని చంపేశారు" అంటూ ప్రవాస బంగ్లాదేశీయులు ఆయనను నిలదీశారు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ బాధ్యతలు చేపట్టిన యూనస్, ఆ పదవి నుంచి తప్పుకున్నాక విదేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో సోమవారం నాడు న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ (JFK) అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆయనకు… -
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
Bangladesh: వస్తే ఓ బాధ, రాకుంటే ఓ బాధ అన్నట్లు తయారైంది బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మన్ పరిస్థితి. భారత్ పర్యటనపై బంగ్లాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షేక్ హసీనాను అప్పగించిన తర్వాతే భారత్‌తో సంబంధాలు పెట్టుకోవాలని కొందరు డిమాండ్ చేస్తుంటే, మరికొందరు బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధితో పాటు నదీ జలాల అంశాలు భారత్‌తో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు. ఆగస్టు మూడో వారంలో, బ్రిక్స్ సదస్సుకు ముందు ఆయన భారత్‌కు వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన… -
Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి తన సొంత దేశం వెళ్తానని ప్రకటించింది. 2024లో హింసాత్మక తిరుగుబాటు తర్వాత ఆమె బంగ్లా నుంచి పారిపోయి భారత్ వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. రెండేళ్ల తర్వాత తొలిసారిగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైలులో వేసినా, చంపేసినా కూడా తన ప్రజల వద్దు వెళ్తానని స్పష్టం చేసింది. తాను అధికారం కోసం వెళ్లడం లేదని, బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం, లౌకిక విలువల… -
Sheikh Hasina: “నరహంతకురాలు”.. షేక్ హసీనా స్పీచ్‌పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
Sheikh Hasina: భారత్‌లోని న్యూఢిల్లీలో నిర్వహించిన ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియా కార్యక్రమంలో మాజీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వర్చువల్‌గా పాల్గొన్నారు. ఆగస్టు 2024లో బంగ్లా విద్యార్థి ఉద్యమం తర్వాత భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. అయితే, రెండేళ్ల తర్వాత షేక్ హసీనా తొలిసారి మౌనం వీడారు. బంగ్లాదేశ్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. షేక్ హసీనాపై బంగ్లాదేశ్ తీవ్ర వ్యాఖ్యలు: ఇదిలా ఉంటే, షేక్ హసీనా మాట్లాడటానికి… -
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్‌లో రాజకీయ కల్లోలం..
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరోసారి రాజకీయ కల్లోలం మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్, మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కథనాలు అక్కడి రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఈ పరిణామం పట్ల అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎస్పీ) తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధ్యక్షుడు రాజీనామా చేయాలని బీఎన్పీ డిమాండ్ చేస్తోంది. షాబుద్దీన్ పదవీ కాలం ముగియడానికి మరో రెండేళ్లు ఉంది. దీనికి ముందే ఆయన రాజీనామా చేస్తారనే… -
India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్‌కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
India-Bangladesh: పచ్చి భారత వ్యతిరేకి, బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ ఉర్ రెహ్మన్ సలహాదరులు జాహెద్ ఉర్ రెహమాన్ వ్యవహారం రెండు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతకు కారణమైంది. ఇటీవల, భారత్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో కోసం వచ్చిన జాహెద్‌ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో 2.5 గంటల పాటు నిలిపేశారు. భారత బ్లాక్‌లిస్టులో ఇతడి పేరు ఉంది. దీంతో అధికారులు విచారణ చేశారు. అయితే, దౌత్య కార్యక్రమంలో కోసం వచ్చిన జాహెద్ తన దౌత్య పాస్‌పోర్టు ఉపయోగించకుండా,… -
Bangladesh: “షేక్ హసీనా చేసిన తప్పు మళ్లీ చేయొద్దు”.. తారిక్ రెహ్మాన్‌కు హెచ్చరిక
Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్పీ ప్రభుత్వానికి స్టూడెంట్ పార్టీ వార్నింగ్ ఇస్తోంది. తమను రెచ్చొగొట్టవద్దని, హింసలో మమ్మల్ని ఎవరూ మించలేరని హెచ్చరిస్తున్నారు. మీకు కూడా షేక్ హసీనాకు పట్టిన గతే పడుతుందని చెబుతున్నారు. స్టూడెంట్ పార్టీగా ఉన్న ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ అధికార ప్రతినిధి ఆసిఫ్ మహమూద్ షోజిబ్ భూయాన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం హింసనే రాజకీయ ఆయుధంగా ఉపయోగించాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఉటాయని, హింసలో మమ్మల్ని ఎవరూ… -
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్‌లో హిందువుల్ని వదిలిపెట్టం..
Bangladesh: పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటి నుంచి బంగ్లాదేశ్ ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ దేశంలోని మతోన్మాద సంస్థలు మాజీ సీఎం మమతా బెనర్జీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ ఢాకా వీధుల్లో ర్యాలీలు నిర్వహించారు. ఇక బెంగాల్‌లోని అక్రమ బంగ్లాదేశీయులు, బంగ్లాదేశ్‌కు వస్తే శరణార్థి సమస్య ఎదురవుతుందని ఆ దేశానికి చెందిన పార్లమెంట్ ఎంపీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన తీవ్రవాద భావాలు ఉన్న మత గురువు మౌలానా… -
Sheikh Hasina: బెంగాల్ సీఎం సువేందుపై షేక్ హసీనా ప్రశంసలు..
Sheikh Hasina: బెంగాల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. సువేందు అధికారి తొలి బీజేపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉంటే, బీజేపీ ఘన విజయం, సువేందు అధికారిపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రశంసలు కురిపించారు. బెంగాల్లో బీజేపీ విజయం, సువేందు అధికారి ప్రజాకర్షణ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది అని ఆమె అన్నారు. బంగ్లాదేశ్ ప్రజల తరఫున, వ్యక్తిగతంగా తాను సువేందును హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. Read Also: Tamil Nadu:…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!