Bangladesh: “షేక్ హసీనా చేసిన తప్పు మళ్లీ చేయొద్దు”.. తారిక్ రెహ్మాన్‌కు హెచ్చరిక
- షేక్ హసీనా చేసిన తప్పు మళ్లీ చేయొద్దు..
- బంగ్లా ప్రభుత్వానికి విద్యార్థి పార్టీ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రధాని తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్పీ ప్రభుత్వానికి స్టూడెంట్ పార్టీ వార్నింగ్ ఇస్తోంది. తమను రెచ్చొగొట్టవద్దని, హింసలో మమ్మల్ని ఎవరూ మించలేరని హెచ్చరిస్తున్నారు. మీకు కూడా షేక్ హసీనాకు పట్టిన గతే పడుతుందని చెబుతున్నారు. స్టూడెంట్ పార్టీగా ఉన్న ‘నేషనల్ సిటిజన్ పార్టీ’ అధికార ప్రతినిధి ఆసిఫ్ మహమూద్ షోజిబ్ భూయాన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం హింసనే రాజకీయ ఆయుధంగా ఉపయోగించాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఉటాయని, హింసలో మమ్మల్ని ఎవరూ మించలేరని అన్నారు. ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్‌లో సంచలనంగా మారాయి. మరోసారి షేక్ హసీనా సమయంలోని ఉద్యమం జరుగుతుందా అనే ప్రశ్నలు నెలకొన్నాయి.
అధికార బీఎన్పీ, నేషనల్ సిటిజన్ పార్టీకి మధ్య జరిగిన ఘర్షణ తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఝెనైదాలో పట్టణంలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ‘‘మీరు మాపై దీనిని రుద్దాలని అనుకుంటే, ఈ పోరాటం ఏ ఒక్క రాజకీయ పార్టీకి, నిర్దిష్ట భావజాలం, సిద్ధంతానికి వ్యతిరేకంగా జరగదు. ఈ పోరాటం మొత్తం ఒక జనరేషన్‌కు వ్యతిరేకంగా సాగుతుంది. షేక్ హసీనా ఈ తరంతో పోరాడి తప్పు చేశారు. తారిఖ్ రెహమాన్ కూడా ఈ తప్పును మళ్లీ చేయొద్దు’’ అని హెచ్చరించారు.
Also Read
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!