Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muhammad Yunus: న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో బంగ్లాదేశ్ మాజీ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌కు తీవ్ర నిరసన ఎదురైంది. “మీరు ఉగ్రవాది, వేలాది మందిని చంపేశారు” అంటూ ప్రవాస బంగ్లాదేశీయులు ఆయనను నిలదీశారు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ బాధ్యతలు చేపట్టిన యూనస్, ఆ పదవి నుంచి తప్పుకున్నాక విదేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో సోమవారం నాడు న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ (JFK) అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఆయనకు ఈ చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. ‘మీరు టెర్రరిస్ట్, బంగ్లాదేశ్‌లో ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నారు, ఇక్కడకు ఎందుకొచ్చారు?’ అంటూ కొందరు వ్యక్తులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని బంగ్లాదేశ్ మీడియా నివేదికల ప్రకారం.. వేలాది మంది పోలీసుల మరణాలకు యూనసే కారణమని ఆరోపిస్తూ ఆయనను వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి, యూనస్‌ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఢాకాకు చెందిన ‘డైలీ సన్’ పత్రిక కథనం ప్రకారం.. ఈ వాగ్వాదం జరుగుతున్న సమయంలో యూనస్, ఆయన సహచరురాలు లామియా మోర్షెద్ హుటాహుటిన ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనపై అప్పట్లో యూనస్ గానీ, ఆయన ప్రతినిధులు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక, 2024 ఆగస్టులో షేక్ హసీనా పదవి నుంచి తప్పుకున్నాక దేశంలో చెలరేగిన అల్లర్లు, హింసను అణచడంలో యూనస్ తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శలున్నాయి. అంతేకాకుండా, యూనస్ పదవీకాలంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా 2025 మార్చిలో చైనాలో పర్యటించినప్పుడు భారత్‌లో ఈశాన్య రాష్ట్రాలపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత దూరాన్ని పెంచాయి.
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
తాజావార్తలు
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!