కర్ణాటక రాజధాని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ సీహెచ్ ప్రతాప్‌రెడ్డి నియమితులయ్యారు.. బెంగళూరు పోలీస్ బాస్‌గా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆయనను సీపీగా నియమిస్తూ కర్ణాటక ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు.. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రతాప్‌రెడ్డి… గతంలో బెంగళూరు నగర అదనపు కమిషనర్‌గా పని చేశారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా ఉన్నారు.. ఇప్పుడు బెంగళూరు పోలీస్ కమిషనర్‌గా…
సాధారణంగా కొంతమంది ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోతూ ఉంటారు. ఒక్కోసారి నిద్ర కారణంగా బాస్‌ల చేత చీవాట్లు కూడా తినాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్కింగ్ అవర్స్‌లో ఉద్యోగులు నిద్రపోవడాన్ని ఏ కంపెనీలు అంగీకరించవు. అయితే విదేశాల్లో కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులు నిద్రపోవడాన్ని అనుమతిస్తాయి. ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతిని మన దేశంలోని పలు కంపెనీలు కూడా ఆచరణలోకి తేవడం ప్రారంభించాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగులు ఆఫీసుల్లో నిద్రపోవచ్చని ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళ్తే..…
ఏపీలోని విజయవాడ నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు కొత్తగా జాతీయ రహదారి ఏర్పడనుంది. బెంగళూరు, కడప, విజయవాడను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హైవేపై 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా అధికారులు రహదారిని నిర్మించనున్నారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు నుంచి ప్రకాశం జిల్లా ముప్పవరం వరకు నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించనున్నారు. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఈ జాతీయ…
ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. నిర్భయ తరహా ఘటనలు అడుగడుగునా జరుగుతున్నాయి. కర్ణాటకలో ఓ బాలికపై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. బెంగళూరులోని యెలహంక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. బాలికపై కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో కిమ్మనకుండా ఉండిపోయింది. https://ntvtelugu.com/breaking-news-young-lady-suicide-at-esi-metro-station/ ఏడుస్తూ వచ్చిన బాలికను తల్లిదండ్రులు ఆరాతీశారు. కబాబ్ తిన్నానని, అందులో కారంగా వుండడంతో ఏడిచానని…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఇతర దేశాలపై పడుతోంది. ముఖ్యంగా విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖార్కివ్ నగరంలో జరిగిన రష్యా రాకెట్ దాడిలో భారతీయ విద్యార్ధి మరణించినట్టు తెలుస్తోంది. కర్నాటకకు చెందిన విద్యార్ధిగా భారత విదేశాంగ శాఖ తెలిపింది. మృతి చెందిన విద్యార్థి కుటుంబంతో మాట్లాడుతున్నామని చెప్పింది విదేశీ వ్యవహరాల శాఖ. విద్యార్ఘి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది విదేశీ వ్యవహరాల శాఖ. విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన అధికారి దీనిని ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు.
గుడి అన్నాక గంటలు మోగడం సహజం. హిందూ దేవాలయాల్లో గుడికి వచ్చిన భక్తులు గంట కొట్టి దణ్ణం పెట్టుకొని వెళ్తారు. అయితే, గుడిలో గంటల మోత అధికంగా ఉందని, గంటల కారణంగా శబ్దకాలుష్యం పెరిగిపోతున్నదని, గంటల శబ్దాన్ని పరిధిమేరకు అదుపులో ఉంచకపోతే శబ్దకాలుష్యచట్టం 2000, పర్యావరణ కాలుష్య చట్టం 1986 ప్రకారం కేసులు నమోదు చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించి పోలీసులు ఆలయ పూజారులకు, యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. బెంగళూరులో దొడ్డగణపతి ఆలయం…
ఈరోజుల్లో పెళ్లి పేరుతో మోసాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకర్ని కాదు.. ఇద్దర్ని కాదు.. ఏకంగా ముగ్గుర్ని పెళ్ళాడాడు ఆ ప్రబుద్ధుడు. చిత్తూరు జిల్లాలో ముగ్గుర్ని పెళ్ళాడిన నిత్య పెళ్ళికొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్యలు. మాయమాటలు చెప్పి ఒకరి తర్వాత మరొకర్ని పెళ్ళాడాడు. ఈ నిత్య పెళ్ళికోడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెద్దతిప్ప సముద్రం మండలంలోని నవాబు కోట కు చెందిన మంజునాథ్ అంగళ్ళ కు చెందిన రజినీకి వివాహం అయింది. మ్యారేజ్ బ్యూరో ద్వారా…
ఈరోజు ఐపీఎల్-15వ సీజన్ మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు రూ.560 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ వేలంలో తొలి ప్రాధాన్య సెట్‌లోని తొలి లాట్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితా బయటకు వచ్చింది. వీరంతా రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు పలుకుతుండటం విశేషం. ఈ జాబితాలో…