వ్యాపారులు ఇటీవల కొత్త పంథాలో ఆలోచిస్తున్నారు. తమ బిజినెస్ చక్కగా సాగాలనే ఉద్దేశంతో పాపులర్ అయిన పేర్లను షాపులకు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ దూసుకుపోతోంది. ప్రతి మొబైల్‌లో ఫేస్‌బుక్ ఉండాల్సిందే. ఈ మధ్య ఫేస్‌బుక్ లైవ్స్, రీల్స్ కూడా నెటిజన్లు చేసేస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన వ్యాపారి ఫేస్‌బుక్ పేరును వాడి లబ్ధి పొందాలని ప్రయత్నించాడు. అచ్చంగా అదే పేరు పెడితే కేసు అవుతుందని భావించి తన బేకరీకి ‘ఫేస్ బేక్’ అని పేరు…
కొన్ని రోజుల నుంచి పవిత్రా లోకేష్, నరేష్ నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్న విషయం తెలిసిందే! వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నారని బెంగళూరు మీడియా కోడై కూస్తున్నప్పటి నుంచీ వీళ్లు టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచారు. తామిద్దరం మంచి స్నేహితులమేనని, అంతకుమించి తమ మధ్య మరే బంధం లేదని క్లారిటీ ఇచ్చినా.. ఎఫైర్ వార్తలు తగ్గడం లేదు. కన్నడ మీడియాలో వీరి గురించి రకరకాల కథనాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పవిత్రా లోకేష్ పోలీసుల్ని ఆశ్రయించింది.…
ఆయన ఓ ప్రజాప్రతినిధి. ఆమె ఓ ఉద్యోగిని. తామున్న స్థాయి దృష్ట్యా.. వాళ్లిద్దరు బాధ్యతతో, మంచి నడవడికతో మెలగాలి. సమాజానికి ఆదర్శంగా నిలవాలి. కానీ.. వాళ్లేం చేశారు? దారి తప్పారు. శారీరక సుఖం కోసం తమ బాధ్యతల్ని, కుటుంబ గౌరవాన్ని పక్కన పెట్టేశారు. ఆఫీసులోనే సరసా సల్లాపాలు కొనసాగించారు. అయితే.. తామున్న సీసీటీవీ కెమెరా ఉందని వాళ్లు గ్రహించలేకపోయారు. దీంతో, వారి అక్రమ వ్యవహారం బట్టబయలైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్ళి తాలూకాలోని జేసిపుర…
ప్రపంచంలోనే హైదరాబాద్ బిర్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. ఒకప్పుడు నిజాంల ప్రత్యేక వంటకంగా పరిగణించబడిన ఈ బిరియాని ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగానే కాకుండా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విరివిగా లభిస్తుంది. హైదరాబాదీ బిరియాని అనే పేరు కనిపిస్తే ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజలు ఆ రుచిని చూసేందుకు క్యూ కడుతుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ వంటకానికి ఉన్న ఆదరణ ఎంతో ప్రత్యేకం. ఈ…
సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు కకావికలం చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్‌ను డ్రగ్స్ కేసు ఎంతో ఇబ్బంది పెట్టింది. ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ వ్యవహారంలో అనేక తలనొప్పులను షారుఖ్ చవిచూశారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన ఓ పార్టీలో సిద్ధాంత్ డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. క్కా సమాచారంతో బెంగళూరు పోలీసులు పార్టీ నిర్వహిస్తున్న…
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఒక విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది. శృంగారం విషయంలో ఇద్దరు ‘గే’ల మధ్య నెలకొన్న గొడవ.. ఒకరి ప్రాణాల్ని బలి తీసుకుంది. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే.. ప్రదీప్ ఓ స్వలింగ సంపర్కుడు. ఇతనికి పురుషులతో సంబంధాలు పెట్టుకోవడం ఇష్టం. ఇతడు మహిళ వేషధారణలో తిరుగుతుండేవాడు. ఇతడు ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఒంటరిగా ఉంటూ.. ఓ షాపులో పని చేసేశాడు. ఒకరోజు ప్రదీప్‌కి రక్షిత్ గౌడ అనే ఆటో డ్రైవర్‌తో…
ఆమె ఓ ఎమ్మెల్యే కూతురు. అయితే, ఆమె తన కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేసింది. అంతేకాకుండా పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది. ఇదంతా రికార్డు చేస్తున్న ఓ విలేకరితో కూడా ఆమె దురుసుగా ప్రవర్తించింది. నా కారునే ఆపుతావా, నేనెవరో తెలుసా అంటూ పోలీసుపై కస్సుబుస్సుమంటూ మండిపడింది. తప్పు చేసి తప్పించుకోవడమే కాకుండా పోలీసులపై ఫైర్ అయిన ఆ యువతి ఓ ప్రజా ప్రతినిధి కుమార్తె అవ్వడం మరో విశేషం. అధికార పార్టీ ఎమ్మెల్యే కుమార్తె…
జాతీయ రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌కు షాక్ తగిలింది. బెంగళూరులో జరిగిన రైతు సంఘాల సమావేశంలో ఆయనపై కొందరు వ్యతిరేకులు దాడి చేశారు. అంతేకాకుండా నల్ల సిరా కూడా చల్లారు. రాకేష్ టికాయత్ మీడియాతో మాట్లాడుతుండగా అక్కడికి వచ్చి కుర్చీలు విసిరి కొందరు దాడికి పాల్పడ్డారు. కొంతకాలంగా రాకేష్ టికాయత్ వర్గానికి, చంద్రశేఖర్ వర్గానికి వైరం నడుస్తోంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయి. Results: సివిల్స్-2021 ఫలితాలు విడుదల ఈ…
సాధారణంగా రైళ్లు రైలు పట్టాలపై, బస్సులు రోడ్లపై ప్రయాణిస్తుంటాయి. కానీ బెంగళూరులోని ఓ రైల్వేస్టేషన్‌లో బస్సులన్నీ రైలెక్కి కూర్చున్నాయి. ఈ అరుదైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే… ఇప్పటివరకు మనం గూడ్స్ రైళ్లలో బైకులు, ట్రాక్టర్లు, లారీలు వంటి వాహనాలనే తరలించడం చూశాం. కానీ తొలిసారిగా ఆర్టీసీ బస్సులను అధికారులు గూడ్స్ రైలులో రవాణా చేశారు. Bharat Bandh: ఈనెల 25న భారత్ బంద్.. ఎందుకంటే..? బెంగళూరు, హోసూరులోని అశోక్ లేలాండ్…