టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్, యూట్యూబర్ ధనశ్రీ వర్మల వివాహబంధం ముగిసింది. ముంబై బాంద్రాలోని కుటుంబ న్యాయస్థానం గురువారం విడాకులు మంజారు చేసింది. పరస్పర అంగీకారంతో చహల్, ధనశ్రీలు ఫిబ్రవరి 5న విడాకులకు దరఖాస్తు చేసుకోగా.. మార్చి 20న డివోర్స్ మంజూరయ్యాయి. 2020 డిసెంబరులో వివాహం చేసుకున్న ఈ జంట.. విభేదాల కారణంగా 2022 జూన్ నుంచి విడిగా ఉంటున్న విషయం తెలిసిందే. విడాకుల వేళ ధనశ్రీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.…