టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్, యూట్యూబర్ ధనశ్రీ వర్మల వివాహబంధం ముగిసింది. ముంబై బాంద్రాలోని కుటుంబ న్యాయస్థానం గురువారం విడాకులు మంజారు చేసింది. పరస్పర అంగీకారంతో చహల్, ధనశ్రీలు ఫిబ్రవరి 5న విడాకులకు దరఖాస్తు చేసుకోగా.. మార్చి 20న డివోర్స్ మంజూరయ్యాయి. 2020 డిసెంబరులో వివాహం చేసుకున్న ఈ జంట.. విభేదాల కారణంగా 2022 జూన్ నుంచి విడిగా ఉంటున్న విషయం తెలిసిందే. విడాకుల వేళ ధనశ్రీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
విడాకుల మంజూరు కోసం గురువారం ధనశ్రీ వర్మ బాంద్రా కోర్టుకు వెళ్లారు. వైట్ టీషర్టు, బ్లూ జీన్స్ వేసుకుని ధనశ్రీ కోర్టుకు హాజరయ్యారు. కారు దిగి కోర్టు లోపలి వెళుతున్న సమయంలో ధనశ్రీని మీడియా చుట్టుముట్టింది. రిపోర్టర్స్, కెమెరామెన్స్ ఒక్కసారిగా ధనశ్రీని చుట్టుముట్టడంతో ఓ మహిళ కింద పడిపోయింది. వెంటనే స్పందించిన ధనశ్రీ.. ఆమెను లేపే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సహనం కోల్పోయి అక్కడున్న వారిపై మండిపడ్డారు. ‘అరే ఏం చేస్తున్నారు?.. ఇదే నా మీ పద్ధతి?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.