రూ.2000 నోట్ల (Rs 2000 notes)ను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకున్న ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడంతో ఆ నోట్లన్నీ బ్యాంకులకు చేరుకుంటున్నాయి. తాజా లెక్కల ప్రకారం.. మే 19 నుంచి 76 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి.