ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మీ పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులుసహా ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని, ఉద్యోగుల సమస్యలేవీ పరిష్కారం కావడం లేదని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.
తెలంగాణలో అప్పులన్నీ తీరి అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ ఎదిగిందని ఆయన తెలిపారు. శనివారం రాత్రి ఆదిలాబాద్‌లో జరిగిన చేరికల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.